ఈ రోజు ఐపీఎల్ లో రాజస్థాన్ తో బెంగళూర్ మ్యాచ్.. ఏ జట్టు కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూడండి

సీజన్ ఆరంభం లో వరుసగా 6 మ్యాచ్ లలో ఓటమి పాలై ఐపీఎల్ ని ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు గత మ్యాచ్ లో ఢిల్లీ జట్టు పైన ఓటమి పొంది ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకుంది.ఆ జట్టు ఇంకో రెండు మ్యాచ్ లు ఆడనుంది.

 Royal Challengers Bangalore Vs Rajasthan Royals Match Predection-TeluguStop.com

అందులో ఒక మ్యాచ్ ఈ రోజు రాజస్థాన్ తో జరుగుతుంది.ఈ రెండు మ్యాచ్ లలో అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఆ జట్టు భావిస్తుంది.

ఇకపోతే గత మ్యాచ్ లో సన్ రైజర్స్ పైన నెగ్గి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.ఒకవేళ రాజస్థాన్ ఆడనున్న రెండు మ్యాచ్ లలో గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు ఇతర జట్ల విజయాల పైన ఆధారపడి ఉంది.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 20 మ్యాచ్ లు జరగగా రాజస్థాన్ జట్టు 10 మ్యాచ్ లు గెలిచింది.బెంగళూర్ జట్టు 8 మ్యాచ్ లలో నెగ్గింది.2 మ్యాచ్ లలో ఫలితం తేలలేదు.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియం లో జరగనుంది.గత రెండు మ్యాచ్ లు చూసుకుంటే ఇక్కడ భారీ స్కోర్ లు నమోదు అయ్యేట్లు కనిపిస్తున్నాయి.చేదన లో బ్యాటింగ్ మరింత తేలిక అయ్యే అవకాశం ఉంది.

3)రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ఆడిన 12 మ్యాచ్ లలో 5 మ్యాచ్ లలో విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది రాజస్థాన్ జట్టు.ఒకవేళ బెంగళూర్ తో మ్యాచ్ లో భారీ విజయం సాధిస్తే ఆ జట్టు నెట్ రన్ రేట్ ని కాస్త మెరుగు పరుచుకోవచ్చు , దీనితో ఆ జట్టు ఆడే రెండు మ్యాచ్ లలో నెగ్గితే ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశం ఉంది.

ఇకపోతే రహానే , స్మిత్ , సంజు శాంసన్ లు అందరూ ఫామ్ లో ఉండడం తో బ్యాటింగ్ లో పటిష్టంగా కనిపిస్తుంది రాజస్థాన్ జట్టు.ఇకపోతే బౌలింగ్ లో వరుణ్ ఆరోన్ , జయదేవ్ ఉనత్కట్ లు గత రెండు మ్యాచ్ లలో మంచి ప్రదర్శనలు ఇచ్చారు.

ఒకవేళ జట్టు సమిష్టిగా రాణిస్తే బెంగళూర్ పైన విజయావకాశాలు ఉంటాయి.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ( PROBABLE XI ) – అజింక్య రహానే , సంజు శాంసన్ , లియమ్ లివింగ్స్టన్ , స్టీవ్ స్మిత్ , ఆస్టన్ టర్నర్ , రియన్ పరగ్ , స్టువర్ట్ బిన్నీ , శ్రేయస్ గోపాల్ ,జయదేవ్ ఉనత్కట్ , వరుణ్ ఆరోన్ , ఓషనే థామస్

4)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఎలా ఉండబోతుంది

గత మ్యాచ్ లో ఢిల్లీ జట్టు పైన ఓటమి పొంది ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకున్న బెంగళూర్ జట్టు ఈ సీజన్ ని విజయాల తో ముగించాలనుకుంటుంది.

ఆ జట్టు ఆటగాడు మెయిన్ అలీ స్వదేశానికి వెళ్లిపోగా అతని స్థానం లో షిమ్రాన్ హెట్ మేయర్ ఆడే అవకాశం ఉంది.ఇక బ్యాటింగ్ లో కోహ్లీ మరొకసారి ఆడబోయే మిగితా రెండు మ్యాచ్ లలో తన సత్తా చాటలనుకుంటున్నాడు.

ఎబీ డివిలియర్స్ , పార్థివ్ పటేల్ ,శివమ్ దుబె , కోహ్లీ లతో బెంగళూర్ జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది.ఈ మ్యాచ్ లో టీం సౌతి కూడా ఆడే అవకాశం ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ( PROBABLE XI ) – పార్థివ్ పటేల్ , విరాట్ కోహ్లీ , డివిలియర్స్ , మార్కస్ స్టయినిస్ , షిమ్రాన్ హెట్ మేయర్ , శివమ్ ధూబే , టీం సౌతి , వాషింగ్టన్ సుందర్ , చహల్ ,నవదీప్ సైని , ఉమేష్ యాదవ్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube