ఈ రోజు ఐపీఎల్ లో ముంబై తో బెంగళూర్ ఢీ , ఏ జట్టుకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉందో చూడండి  

Royal Challengers Bangalore Vs Mumbai Indians Who Will Win-

వరుస పరాజయాల తరువాత కింగ్స్ ఎలెవన్ జట్టు పైన గెలిచి ఈ ఐపీఎల్ సీజన్ లో బోణి కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు ముంబై సొంత గ్రౌండ్ లో ఈ రోజు ముంబై తో తలపడనుంది.ముంబై తమ గత మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు పైన భారీ స్కోర్ చేసిన బౌలర్లు విఫలమవడం తో ఆ జట్టు ఓటమి పాలైంది.

Royal Challengers Bangalore Vs Mumbai Indians Who Will Win--Royal Challengers Bangalore Vs Mumbai Indians Who Will Win-

ఇకపోతే బెంగళూర్ జట్టు కింగ్స్ ఎలెవన్ జట్టు పైన బ్యాటింగ్ లో బౌలింగ్ లో సమిష్టి గా రాణించి తొలి విజయాన్ని అందుకుంది.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు బెంగళూర్ కి ముంబై కి జరిగిన 26 మ్యాచ్ లలో ముంబై జట్టు 17 గెలవగా బెంగళూర్ జట్టు 9 మ్యాచ్ లలో విజయం సాధించింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ ముంబై లోని వాన్ఖడే స్టేడియం లో జరగనుంది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.

పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించనుంది.

3)ముంబై ఇండియన్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ముంబై జట్టు బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తుంది.ఆ జట్టు లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగల ఆల్రౌండర్ లు ఉండడం ఆ జట్టుకు కలిసిలోచ్చే అంశం.అయితే టాప్ ఆర్డర్ లో ఆడుతున్న సూర్య కుమార్ యాదవ్ ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు.

రోహిత్ శర్మ , డికాక్ లు గత మ్యాచ్ లో జట్టు కి మంచి శుభారంభాన్ని అందించారు.బౌలింగ్ లో నిలకడ లేక ముంబై జట్టు ఇబ్బంది పెడుతుంది , ఆ జట్టు కి వరుసగా రెండు గెలుపులలో ప్రధాన పాత్ర వహించిన జోసెఫ్ గత మ్యాచ్ లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.

బెంగళూర్ జట్టు బ్యాటింగ్ ని కట్టడి చేస్తే ఆ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ముంబై ఇండియన్స్ జట్టు (PROBABLE XI )రోహిత్ శర్మ , డికాక్ / ఈవిన్ లెవీస్ , సూర్య కుమార్ యాదవ్ , ఇషాన్ కిషన్ , పొలార్డ్ , హార్దిక్ పాండ్య , కృనల్ పాండ్య , మార్కడేయ , బుమ్ర , బెహరోడాఫ్ , జోసెఫ్

4)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఎలా ఉండబోతుంది

బెంగళూర్ జట్టు తమ గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.పెద్దగా మార్పులేమి చేయకపోవచ్చు.అయితే ఆ జట్టు బౌలర్ల లో సిరాజ్ భారీగా పరుగులిస్తున్న విరాట్ కోహ్లీ అతని పైన నమ్మకం ఉంచుతున్నాడు.

ఆ జట్టు బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లు అందరూ ఫామ్ లోకి రావడం జట్టు బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తుంది.బెంగళూర్ జట్టు టాస్ గెలిస్తే లక్ష్య చేదన చేసే అవకాశాలు ఉన్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ( PROBABLE XI ) – పార్థివ్ పటేల్ , కోహ్లీ , డివిలియర్స్ , మెయిన్ అలీ ,మార్కస్ స్టయినిస్ , అక్షదీప్ నాథ్ , పవన్ నెగి , చాహల్ , సిరాజ్ ,ఉమేష్ యాదవ్ , టీమ్ సౌతి