ఈ రోజు ఐపీఎల్ లో ముంబై తో బెంగళూర్ ఢీ , ఏ జట్టుకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉందో చూడండి

ఈ రోజు మ్యాచ్ లో బెంగళూర్ , ముంబై మధ్య మ్యాచ్ బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియం లో జరగనుంది.బెంగళూర్ , ముంబై జట్లు వారు ఆడిన మొదటి మ్యాచ్ లు ఓడిపోవడం తో రెండో మ్యాచ్ లో ఎలాగైనా గెలవలన్న లక్ష్యం తో బరిలోకి దిగానున్నాయి.

 Royal Challengers Bangalore Vs Mumbai Indians Match Prediction-TeluguStop.com

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు తన సొంత గడ్డ పై ఆడుతుండడం అక్కడ ఆ జట్టుకి మంచి రికార్డ్ ఉంది.ఇకపోతే ముంబై ఇండియన్స్ జట్టు ప్రతి సీజన్ లో మాదిరిగానే ఈ సీజన్ లో కూడా మొదటి మ్యాచ్ ఓటమితో మొదలయింది.ఆ జట్టు చివరి మ్యాచ్ లో బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోను విఫలమైంది.

పిచ్ ఎలా ఉండబోతుంది

బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియం లోని పిచ్ బ్యాటింగ్ కో స్వర్గధామం , ఇక్కడ బౌండరీ లు చిన్నవిగా ఉండడం బ్యాట్స్ మెన్ భారీ స్కోర్లు చేసుకోవడానికి ఎక్కువ వీలు ఉంటుంది , మొదట బ్యాటింగ్ చేసే జట్టు 180 పైగా పరుగులు చేసే అవకాశం ఉంది.పిచ్ పై బౌలింగ్ చేస్తున్నకొద్ది స్పిన్నర్లకు అనుకూలించవచ్చు.

ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ముంబై ఇండియన్స్ కి రాయల్ ఛాలెంజర్స్ కి మధ్య ఇప్పటి వరకు 25 మ్యాచ్ లు ఆడగా ముంబై ఇండియన్స్ 16 మ్యాచ్ లు గెలవగా బెంగళూర్ జట్టు 9 మాచ్ లు గెలిచింది.

ముంబై ఇండియన్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ముంబై తన మొదటి మ్యాచ్ లో నే బౌలింగ్ లో ఘోరంగా విఫలమైంది , ఎప్పుడు జట్టులో ప్రయోగాలు చేసే ముంబై ఈ సారి కూడా 17 ఏళ్ళ సలాం అనే యువ బౌలర్ ని ప్రయత్నించింది.భారత నెంబర్ వన్ బౌలర్ బూమ్రా కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.అయితే చివరి మ్యాచ్ లో చివరి ఓవర్ లో బౌలింగ్ చేస్తున్న బూమ్రా గాయపడ్డాడు , అతను పూర్తిగా కోలుకోకుంటే ముంబై కి పెద్ద దెబ్బే అవుతుంది.

ముంబై ఇండియన్స్ జట్టు ( PROBABLE XI ) – రోహిత్ శర్మ , డి కాక్ , సూర్య కుమార్ యాదవ్ , యువరాజ్ సింగ్ , కీరాన్ పోలార్డ్ , హార్దిక్ పాండ్య , కృనల్ పాండ్య, సలామ్ , బెన్ కటింగ్ /లసిత్ మలింగ , మెక్ లారెన్ , బూమ్రా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఎలా ఉండబోతుంది

బెంగళూర్ జట్టు తన మొదటి మ్యాచ్ లో చెన్నై చేతిలో 70 పరుగులకే ఆలౌట్ అయింది.అనుభవజ్ఞులైన స్టార్ బ్యాట్స్ మెన్ కోహ్లీ , డివిలియర్స్ కూడా పెద్దగా పరుగులేమి చేయకుండా వెనుదిరిగారు.ఈ మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ విజృంభిస్తే బెంగళూర్ జట్టు భారీ స్కోర్ చేయగలదు.

బౌలింగ్ లో బెంగళూర్ జట్టు బలంగానే కనిపిస్తుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ( Probable ) : విరాట్ కోహ్లీ , పార్థివ్ పటేల్ , షిమ్రాన్ హెట్ మేయర్ , ఏ బి డివిలియర్స్ , కోలిన్ డి గ్రాండి హోమ్ , శివమ్ ధూబె , చాహల్ , సుందర్ , ఉమేష్ యాదవ్ , టీమ్ సౌథీ , నవదీప్ సైనీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube