విరాట్ సేనకి మరో ఓటమి! కెప్టెన్సీ లోపాలే కారణమా

బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో నాలుగో ఓటమి తన ఖాతాలో వేసుకుంది.విరాట్ కోహ్లి సారధ్యంలో బెంగుళూరు టీం లో నిలకడ లేమి, టీం భాగస్వామ్యం, బౌలర్స్ వైఫల్యం అన్ని వెరసి వరుస ఓటముల రికార్డ్ ని కొనసాగిస్తూ ఉంది.

 Royal Challengers Bangalore Suffer Fourth Defeat-TeluguStop.com

విరాట్ కోహ్లి కూడా సరైన విధంగా రాణించకపోవడం, బలమైన టాప్ ఆర్డర్ ఉన్న కూడా ఎందుకనో బెంగుళూరు తడబడుతూ వస్తుంది.ఇదిలా ఉంటే ఇది ఐపీఎల్ సీజన్ లో కోహ్లి సారధ్యం వహించిన వందవ మ్యాచ్ కావడం విశేషం.

తాజాగా రాజస్తాన్ రాయల్స్ తో బెంగుళూరు తలపడింది.శఅజింక్య రహనే నాయకత్వంలో ఆడుతున్న రాజస్థాన్ కూడా వరుస మూడు ఓటములతో ఉంది.రెండు టీం లకి కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో రెండు గట్టిగా తలపదతాయని అందరూ భావించారు.అయితే మొదటి బాటింగ్ చేసిన బెంగుళూరు ఓపెనర్స్ కోహ్లి, డివిలియర్స్ ని శ్రేయాస్ గోపాల్ తన స్పిన్ మాయాజాలంతో వెంటనే పెవిలియన్ కి పంపించాడు.

తరువాత బెంగుళూరుకి పెద్దగా కోలుకునే అవకాశం రాకపోయినా పార్ధివ్ పటేల్ రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేసింది.

158 పరుగుల లక్ష్య చేదనతో బరిలోకి దిగిన రాజస్తాన్ జోస్ బట్లర్, స్మిత్ రాణించడంతో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సొంతం చేసుకుంది.దీంతో రాజస్థాన్ ఖాతాలో మూడు పరాజయాల తర్వాత ఒక గెలుపు ఖాతాలో పడింది.ఇక బెంగుళూర తన అపజయాల ప్రస్తానం నడుస్తుంది.

అయితే బెంగుళూరు టీం వైఫల్యాలకి కారణం కెప్టెన్ గా విరాట్ టీంని సమన్వయం చేస్తూ నడిపించలేకపోవడమే అనే టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube