ఐపీఎల్ 2020 నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవుట్..!

తాజాగా ఐపీఎల్ 2020 ఎలిమినేటర్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా చివరి వరకు సాగింది.లో స్కోరింగ్ మ్యాచ్ లో ఇరు జట్లు విజయం కోసం చివరి వరకు ప్రయత్నించాయి.ఈ ఉత్కంఠ పోరులో చివరికి బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 19.4 ఓవర్లలలో ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2020 సీజన్ నుండి నిష్క్రమించింది.దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు క్వాలిఫైయర్ 2 లో అడుగు పెట్టింది.

 Royal Challengers Bangalore Out From Ipl, Ipl2020, Sunrisers Hyderabad, Ipl2020,-TeluguStop.com

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 161 పరుగులు చేయగలిగింది.ఇందులో ఏబి డివిలియర్స్ 56 పరుగులు, ఆరోన్ ఫించ్ 32 పరుగులతో రాణించారు.

మిగతావారు అట్టర్ ఫ్లాప్ అయ్యారు.ఈ సీజన్ లో మొట్టమొదటిసారిగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అవతారమెత్తిన విరాట్ కోహ్లీ కేవలం 6 పరుగులకే హోల్డర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బోలింగ్ శిబిరంలో జేసన్ హోల్డర్ కి 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లను తీసుకున్నాడు.అలాగే నటరాజన్ 2 వికెట్లు షాబాజ్ నదీమ్ ఒక వికెట్ తీసుకున్నారు.

లక్ష్య ఛేదనకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆదిలోనే గోస్వామి అవుట్ అవ్వగా అనంతరం క్రీజ్ లోకి వచ్చిన మనీష్ పాండే ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.అయితే అనుకోని రీతిలో డేవిడ్ వార్నర్ ఔటయ్యాక స్కోర్ బోర్డ్ నెమ్మదించింది.

ఆ తర్వాత టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ అవుట్ అవ్వడంతో సన్ రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది.ఆ తర్వాత వచ్చిన కేన్ విలియమ్సన్, జగన్ హోల్డర్ ఆచితూచి ఆడుతూ మ్యాచును విజయతీరాలకు చేర్చారు.

ఈ మ్యాచ్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ నుండి నిష్క్రమించగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు క్వాలిఫైయర్ 2 కు అర్హత సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube