నన్ను పట్టుకోవడం మీ వల్లకాదని పోలీసులకే సవాల్ విసిరిన రౌడీ.. చివరకు.

నన్ను పట్టుకోవడం దేవుడికే సాధ్యం కాదు.ఆఫ్ట్రాల్ మీ పోలీసులెంత.

 Rowdy Sheeter Challenge Mumbai Police, Crime News, Crime Story,rowdy Sheeter,mum-TeluguStop.com

నన్ను మీరు ఎప్పటికీ పట్టుకోలేరు.ఇలాంటి డైలాగులు కేవలం సినిమాల్లోనే వినిపిస్తాయి.

నిజ జీవితంలో అలాంటి డైలాగులను చెప్పే దైర్యం ఎవ్వరూ చేయరు.అందులోను పోలీసులతో ఇలాంటి మాటలు చెప్పే దైర్యం అయితే అస్సలు చేయరు.

నిజ జీవితంలో ఇలాంటి డైలాగులతో ఏకంగా పోలీస్ స్టేషన్ కే మెసేజ్ పంపించి దమ్ముంటే నన్ను పట్టుకోండని ఏకంగా పోలీసులకే సవాల్ విసిరాడు ఒక రౌడీ షీటర్.ఇలాంటి సవాల్ ముంబైలోని ఆరే పోలీస్ స్టేషన్ లోని పోలీసులకు ఎదురైంది.

ముంబైలో పప్పు హరిశ్చంద్ర అలియాస్ ఖోప్డీ అనే రౌడీ షీటర్ ఉన్నాడు.అతని వయసు 26 సంవత్సరాలు.ఈ రౌడీ షీటర్ 2013 సంవత్సరం నుండి పోలీసులకు చిక్కకుండా నేరాలు చేస్తున్నాడు.ఈ రౌడీ షీటర్ కు కేవలం ముంబై నగరంలోనే కాకుండా సకీనాక, ఎఐడీసీ, ఫోవాయ్ వంటి ప్రాంతాల పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై చాలా కేసులు ఉన్నాయి.

అయితే కొన్ని రోజుల క్రితం పోలీసులకు పప్పు హరిశ్చంద్ర ఒక వ్యక్తి ద్వారా ఒక మెసేజ్ పంపాడు.నన్ను పట్టుకోవడం దేవుడికే సాధ్యం కాదు.

ఆఫ్ట్రాల్ మీ పోలీసులెంత.నేను మీకు దొరకని.

నన్ను మీరు ఎప్పటికీ పట్టుకోలేరు.అని పోలీసులకు చెప్పమని ఆ వ్యక్తిని పంపించాడు.

ఈ మెసేజ్ విన్న పోలీసులు దీనిని ఒక సవాల్ గా తీసుకున్నారు.ఇది జరిగిన కొద్దీ రోజుల్లోనే హరిశ్చంద్ర ఒక ప్రాంతంలో చోరీ చేయబోతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మఫ్టీలో ఆ ప్రాంతంలో గస్తీ కాసారు.

హరిశ్చంద్ర రాగానే అతడిని చుట్టుముట్టి అరెస్ట్ చేసారు.అంతేకాదు అతడిని అరెస్ట్ చేసిన ఫొటోతో ఒక ట్వీట్ పెట్టారు.హరిశ్చంద్ర ఇప్పటికైనా దేవుడిపై అతడికి ఉన్న అభిప్రాయాన్ని, పోలీసుల శక్తిపై అతడికి ఉన్న అపనమ్మకాన్ని మార్చుకుంటాడేమో.అని ముంబై పోలీసులు ట్వీట్ చేసారు.

పోలీసులకే సవాల్ విసిరి చివరకు దొరికిపోయిన హరిశ్చంద్రపై పోలీసుశాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

https://twitter.com/MumbaiPolice/status/1357990299255992321

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube