'రౌడీ బాయ్స్' కోసం రంగంలోకి దిగుతున్న రౌడీ స్టార్!

‘రౌడీ బాయ్స్’ సినిమాతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుండి ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.ఆశిష్ దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు.

 Rowdy Boys Movie Song Will Be Released By Vijay Devarakondam, Vijay Devarakonda,-TeluguStop.com

అందుకే కొడుకు వరుస అయ్యే ఆశిష్ ను దిల్ రాజు గ్రాండ్ గా లాంచ్ చెయ్యాలని అనుకుంటున్నాడు.అందుకే ప్రమోషన్స్ భారీగా చేస్తూ ఈ సినిమాను జనాలకు రీచ్ చేస్తే ఆశిష్ కూడా ప్రేక్షకులకు మరింత పరిచయం అవుతాడని దిల్ రాజు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు.

Telugu Devi Sri Prasad, Dil Raju, Asish, Rowdy, Rowdyvijay-Movie

రౌడీ బాయ్స్ పేరుతొ ఆశిష్ తెలుగు సినీ తెరమీద అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాడు.ఇప్పటికే విడుదల అయినా టీజర్, టైటిల్ సాంగ్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచేసాయి.ఇక ఇప్పుడు మరొక సాంగ్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ భారీగా ప్లాన్ చేస్తుంది.ఈ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు టాలీవుడ్ రౌడీ స్టార్ ను రంగం లోకి దింపుతున్నారు.

ఈ రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేసేందుకు విజయ్ దేవరకొండ రాబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.అక్టోబర్ 20న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా విచ్చేసి ఈ సాంగ్ ను లాంచ్ చేయబోతున్నారు.

రౌడీ స్టార్ లాంచ్ చేయబోతున్నారు కాబట్టి ఈ సినిమా మరింత పాపులర్ అయ్యే అవకాశం ఉంది.ఇక ఈ సినిమాలో ఆశిష్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Devi Sri Prasad, Dil Raju, Asish, Rowdy, Rowdyvijay-Movie

ఈ సినిమాను శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకు బడ్జెట్ కూడా భారీగా పెట్టినట్టు టాక్.కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరి దిల్ రాజు చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా గ్రారేంటీ హిట్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube