రౌడీ బాయ్స్ మూవీ రివ్యూ: యువతను పిచ్చెక్కిస్తున్న రౌడీ బాయ్స్!

డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా రౌడీ బాయ్స్.ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి అనే కొత్త హీరో పరిచయమయ్యాడు.

 Rowdy Boys Movie Review And Rating Rowdy Boys, Tollywood, Movie Review, Rating,-TeluguStop.com

ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.అంతేకాకుండా కార్తీక్ రత్నం, సాహిదేవ్ విక్రమ్, కోమలి ప్రసాద్ తదితరులు నటించారు.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరిష్ నిర్మించారు.ఇక దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ రోజు విడుదల కాగా.ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

ఇందులో ఆశిష్ అక్షయ్ పాత్రలో కనీస బాధ్యతలు లేకుండా తిరుగుతూ ఉంటాడు.చదువుకోవాలన్న ఉద్దేశంతో బీటెక్ ఫస్ట్ ఇయర్ లో చేరడానికి కాలేజీ కి వెళ్తాడు.

ఇక అదే సమయంలో మెడికల్ స్టూడెంట్ చదువుతున్న కావ్య (అనుపమ పరమేశ్వరన్) ను చూసి ప్రేమలో పడతాడు.కానీ ఆశిష్ కాలేజ్ వాళ్లకు మెడికల్ కాలేజ్ వాళ్లకు మధ్య గొడవలు ఉంటాయి.

ఈ రెండు కాలేజ్ వాళ్ళు ఎప్పుడు ఎదురుపడిన కూడా బాగా కొట్టుకుంటారు.మరోవైపు కావ్య ను చేసి తన క్లాస్ మేట్ విక్రమ్ (సాహిదేవ్ విక్రమ్) ప్రేమలో పడతాడు.

అలా వీరి ప్రేమ చివరికి ఎలా ఉంటుంది.ఎలా సక్సెస్ అవుతుంది.

చివరికి ఆ రెండు కాలేజ్ వాళ్ళు కలుస్తారా లేదా అనేది మిగిలిన కథలో చూడవచ్చు.

Telugu Ashish Reddy, Dil Raju, Review, Rowdy, Tollywood-Movie

నటినటుల నటన:

ఆశిష్ తొలిసారిగా నటించిన కూడా చాలా వరకు బాగా మెప్పించాడు.తన డాన్స్ కూడా బాగా ఆకట్టుకుంది.అనుపమ పాత్ర కూడా బాగా మెప్పించింది.

ఈసారి రొమాంటిక్ సన్నివేశాల్లో బాగా నటించింది.ఇందులో కూడా తన నటనకు ఫుల్ కి ఫుల్ మార్కులు సంపాదించుకుంది.

ఇక మిగతా నటీనటులంతా బాగానే మెప్పించారు.

Telugu Ashish Reddy, Dil Raju, Review, Rowdy, Tollywood-Movie

టెక్నికల్:

టెక్నికల్ పరంగా చూసినట్లయితే దర్శకుడు మంచి కథను అందించాడు.కుర్రాళ్లకు ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు.దేవి శ్రీ ప్రసాద్ పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి.

సినిమాటోగ్రఫీ బాగుంది.ప్రొడక్షన్ పనులు కూడా బాగా ఆకట్టుకున్నాయి.

Telugu Ashish Reddy, Dil Raju, Review, Rowdy, Tollywood-Movie

విశ్లేషణ:

ఈ సినిమా మొత్తం యువతకు సంబంధించిన సినిమా అని చెప్పవచ్చు.కాలేజీలో స్టూడెంట్స్ ప్రవర్తించే విధానంను అద్భుతంగా చూపించారు డైరెక్టర్.అంతేకాకుండా రిలేషన్ లో ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అనేది కూడా బాగానే చూపించారు.కామెడీ కూడా బాగానే ఆకట్టుకుంది.పాటలను కూడా అద్భుతంగా అందించారు.

ప్లస్ పాయింట్స్:

కథ, నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీకి, పాటలు, నేపథ్య సంగీతం, కామెడీ.

మైనస్ పాయింట్స్:

కథ కాస్త స్లోగా సాగినట్లు అనిపించింది.కథనం కాస్త నిరాశ పరిచినట్లు అనిపించింది.

బాటమ్ లైన్:

ఈ సంక్రాంతి పండగకు కుర్రాళ్లను అలరించే విధంగా తెరకెక్కిన ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

రేటింగ్: 2.5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube