90 కోట్ల మందిని మెప్పించిన రౌడీ బేబీ

ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సాయి పల్లవి.మొదటి సినిమాతోనే నటిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న ఈ అమ్మడు డాన్సింగ్ స్టార్ అనే విషయం చాలా మందికి తెలియదు.తెలుగు ఢీ డాన్స్ షోలో సాయి పల్లవి పాల్గొంది.ఇక ఫిదా సినిమాలో కూడా తన డాన్స్ టాలెంట్ చూపించింది.వచ్చిండే సాంగ్ తో యుట్యూబ్ లో దుమ్ము రేపింది.తెలుగులో ఇప్పటి వరకు ఏ సాంగ్ కి రాని వ్యూస్ ఈ సాంగ్ కి వచ్చాయి.

 Rowdy Baby Video Song Crossed 90 Crores Views, Tollywood, Kollywood, Maari 2 Mov-TeluguStop.com

ఇక తరువాత తమిళంలో మారి2 తో ధనుష్ కి జోడగా సాయి పల్లవి నటించింది.ఇందులో రౌడీబేబీ అనే డ్యూయెట్ ధనుష్, సాయి పల్లవి మీద చిత్రీకరించారు.

ఈ పాటకి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు.ఇక ఈ రౌడీ బేబీ వీడియో సాంగ్ అయితే యుట్యూబ్ లో అన్ని రికార్డులని తన సొంతం చేసుకుంది.

ఎవ్వరూ ఊహించని స్థాయిలో, బాలీవుడ్ సినిమా పాటలకి కూడా లేని క్రేజ్ ని ఈ సాంగ్ సొంతం చేసుకుంది.గతంలో సలీమాన్ ఖాన్ టింగేర్ జిందా హై సినిమాలోని సాంగ్ ని 80 కోట్ల మంది వీక్షిస్తే రౌడీ బేబీ సాంగ్ ఆ రికార్డుని ఏడాదిలో బ్రేక్ చేసి ఏకంగా 90కోట్లు వ్యూస్ క్రాస్ చేసింది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సౌత్ ఇండియా సాంగ్ కి ఈ స్థాయిలో గుర్తింపు రావడం నిజంగా ప్రత్యేకం అని చెప్పాలి.ఇక ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి చూసిన వారే పదే పదే చూడటానికి కారణం సాయి పల్లవి డాన్స్ టాలెంట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మొత్తానికి చేసిన సినిమాలు తక్కువ అయినా ఈ రౌడీ బేబీ సౌత్ లో తన బ్రాండ్ మాత్రం గట్టిగానే క్రియేట్ చేసుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube