రూటు మార్చిన కెసీఆర్... ఈ నిర్ణయంతో అవాక్కైన టీఆర్ఎస్ శ్రేణులు

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి ఉంది.ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో జిల్లాల వారీగా తమ పార్టీ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 Route Changed Kcr  Trs Leaders Unaware Of This Decision Details, Trs Party, Cm K-TeluguStop.com

అందుకు తగ్గట్టుగానే ప్రతి ఒక్క పార్టీ ఇప్పుడు జిల్లాల వారీగా తమ బలాన్ని మరింత పెంచుకునే దిశగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.ఆ దిశగానే కెసీఆర్ కూడా దృష్టి సారిస్తూ జిల్లాల వారీగా అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మెజారిటీ జిల్లాల అధ్యక్షులు ఎమ్మెల్యేలు కావడం ఒక్కసారిగా రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసిన అంశం.

అయితే జిల్లాలో ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు కాకుండా ఎమ్మెల్యేలకే ఈ సారి అవకాశం ఇవ్వడంతో పార్టీని పటిష్ట పరచిన వాళ్ళకి మరల వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే విధంగా కూడా కెసీఆర్ ఈ వ్యూహాన్ని పన్ని ఉండొచ్చు అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇక కెసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా పార్టీని పటిష్ట పరిచే బాధ్యత ఎమ్మెల్యేల భుజాన పడింది.ఇక ఈ నిర్ణయంతో ఒక్కసారిగా అందరి దృష్టి కెసీఆర్ పై పడింది.

మామూలుగా అయితే ఈ నిర్ణయాన్ని ఎవరూ ఊహించి ఉండరు.ఇంకొక వాదన వినిపిస్తున్నది ఏమిటంటే ఇక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వారికి మంత్రి పదవులు దక్కవనే ఒక ప్రచారం మొదలైంది.ఇందులో ఎంత వరకు నిజం ఉందనే మాటను ప్రక్కకు పెడితే టీఆర్ఎస్ పార్టీలో అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న వారికి మాత్రం కొంత కెసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం నిరాశపరిచి ఉంటుందని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

TRS Leaders Shock With CM KCR Decision Telangana

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube