కొత్త పెళ్లి సందడి నుంచి హీరో రోషన్ లుక్ రివీల్

రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందడి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా శ్రీకాంత్ కి లవర్ బాయ్ ఇమేజ్ తీసుకురావడంతో పాటు ఒక్కసారిగా ఆయన కెరియర్ కి ఊపు తీసుకొచ్చింది.

 Hero Srikanth's Son Roshan Stills From Pellisandad Movie, Raghavendra Rao, Gour-TeluguStop.com

కమర్షియల్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక మార్కెట్ ఏర్పరుచుకునేలా చేసింది.ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ కెరియర్ పూర్తిగా మారిపోయింది.

మరి అదే టైటిల్ తో మళ్ళీ రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే సినిమా వస్తుంది అంటే కచ్చితంగా దాని మీద అందరికి ఆసక్తి ఉంటుంది.భక్తిరస చిత్రాలకే పరిమితం అయిపోయిన రాఘవేంద్రుడు మళ్ళీ ఇలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ తీస్తున్నాడు అంటూ అందమైన పాటలు చూడొచ్చు అని అందరూ భావించారు.

అలాగే సినిమాలో హీరోగా ఎవరు నటిస్తున్నారు అనే చర్చ కూడా నడిచింది.

శ్రీకాంత్ కొడుకు రోషన్ ని ఈ సినిమాతో లవర్ బాయ్ గా ప్రెజెంట్ చేయబోతున్నట్లు టాక్ వినిపించింది.

అందుకు తగ్గట్లుగానే తాజాగా కొత్త పెళ్లి సందడి మూవీ నుంచి రోషన్ లుక్ ని రివీల్ చేశారు.నిర్మల కాన్వెంట్ సినిమాలో పసిఛాయలతో ఉన్న రోషన్ చాలా గ్యాప్ తీసుకొని ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని, ఫిట్ నెస్ ఇంప్రూవ్ చేసి అదిరిపోయే లుక్ తో ఈ పోస్టర్ లో కనిపించాడు.

అచ్చంగా లవర్ బాయ్ లానే ఉన్నాడనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.హీరో ఫీచర్స్ అతనిలో కనిపిస్తున్నాయని అప్పుడే ప్రశంసలు కురిపిస్తున్నారు.కచ్చితంగా రోషన్ కి పెళ్లి సందడి మంచి చిత్రం అవుతుందని అంటున్నారు.అయితే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కుతుంది అనుకున్న ఈ సినిమా ఇప్పుడు చేతులు మారింది.

గౌరీ రోణంకి ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం కాబోతూ ఉండగా.రాఘవేంద్రుడు కేవలం దర్శకత్వం పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube