కాంగ్రెస్ ఎమ్మెల్యే బేగ్ ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు  

Roshan Baig Under In Cit Custody-

పోంజీ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కర్ణాటక ఎమ్మెల్యే రోషన్ బేగ్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.అప్పటికే ఛార్టెర్డ్ విమాన మెక్కిన ఆయన కిందకి దించి మరీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.విమానం నుంచి కిందకు దిగిన ఆయనను ఎక్కడకి వెళుతున్నారని ప్రశ్నించడం తో ఒకసారి ఢిల్లీ అని,మరోసారి పూణే వెళుతున్నాను అంటూ పొంతనలేకుండా సమాధానం చెప్పడం తో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు...

Roshan Baig Under In Cit Custody--Roshan Baig Under In CIT Custody-

ఫ్లైట్ డిటైల్స్ ప్రకారం బేగ్ పూణె వెళ్తున్నట్టు తేలిందని పోలీసులు పేర్కొన్నారు.ఐఎంఏ పోంజీ స్కీం కేసులో ఈ నెల 19న తమ ముందు హాజరు కావాల్సిందిగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.బేగ్‌కు నోటీసులు ఇచ్చింది.

అయితే, గుర్తు తెలియని ప్రదేశానికి ఆయన పారిపోయేందుకు ప్రయత్నిస్తుండడంతో అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది.ఆయనను అరెస్ట్ చేయాలా? వద్దా? అనే విషయాన్ని బేగ్‌ను ప్రశ్నించిన తర్వాతే నిర్ణయించనున్నట్లు తెలుస్తుంది.బేగ్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయాన్నీ ముఖ్యమంత్రి కుమార స్వామి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Roshan Baig Under In Cit Custody--Roshan Baig Under In CIT Custody-

బేగ్ తో పాటు బీజేపీ నేత యడ్యూరప్ప వ్యక్తిగత కార్యదర్శి సంతోష్ కూడా ఉన్నాడని,అయితే అధికారులను చూసిన తరువాత అతడు అక్కడ నుంచి జారుకున్నట్లు కుమారస్వామి తెలిపారు.ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్వర్‌ కూడా విమనాశ్రయంలోనే ఉన్నారని ఆయన చెప్పారు.అవినీతి కేసులో ఉన్నవారిని కాపేడేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండడం సిగ్గుచేటన్నారాయన.ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనడానికి ఇదే నిదర్శనమని కుమారస్వామి తెలిపారు.

ఇక ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో రోషన్‌ బేగ్‌ను కాంగ్రెస్‌ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.