మనకు ఎన్నో పువ్వులు ఉన్నా గులాబీ పువ్వులకు ఉన్న ప్రత్యేకత వేరుగానే ఉంటుంది.మనలో చాలా మంది గులాబీ పువ్వులంటే చాలా ఇష్టపడతారు.
గులాబీ లను ఎన్నో సౌందర్య సాధనలలో ఉపయోగిస్తున్నారు.అలాగే గులాబీతో తయారుచేసిన రోజ్ వాటర్ ని కూడా ఎన్నో సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తున్నారు.
రోజ్ వాటర్ తో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
రోజ్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్,యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు,విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన చిన్న చిన్న దెబ్బలు,గాయాలను నయం చేయటంలో సహాయపడుతుంది.
ఎండ వేడికి కమిలిన ముఖ చర్మానికి రోజ్ వాటర్ రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.అలాగే కంటి వాపులను కూడా సమర్ధవంతంగా తగ్గిస్తుంది.
కీటకాలు కుట్టిన ప్రదేశంలో రోజ్ వాటర్ ని రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
మేకప్ ని తొలగించుకోవడానికి బాగా సహాయపడుతుంది.
రోజ్ వాటర్, జోజోబా ఆయిల్‌లను సమభాగాలుగా తీసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి కాటన్ క్లాత్ తో తుడిస్తే మేకప్ సులభంగా తొలగిపోతుంది.
మొటిమలు ఉన్నా, చర్మం దురదగా ఉన్నా ప్రదేశంలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసిన నీటిని రాస్తే ఇరిటేషన్ తగ్గిపోతుంది.
జాస్మిన్ ఆయిల్‌లో కొద్దిగా రోజ్ వాటర్‌ను మిక్స్ చేసి శరీరానికి రాస్తే శరీరం నుండి వచ్చే దుర్వాసన తొలగిపోయి తాజాగా ఉంటుంది.
తాజా కీరదోసను రసంగా చేసుకుని దానిలో టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, కొన్ని పచ్చి పాలు కలిపి ఫ్రిజ్‌లో 15 నిమిషాల పాటు ఉంచాలి.
అనంతరం దానిలో దూదిని ముంచి ముఖాన్ని తుడిస్తే మురికి తొలగిపోతుంది.ఇది సహజమైన టోనర్‌లా పనిచేస్తుంది.