కూల్ కూల్ రోజ్ షర్బత్ త్రాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

ఈ వేసవిలో ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి.ఎండలో బయటకు వెళ్ళమంటే విపరీతమైన అలసట రావటం ఖాయం.

 Rose Sharbatbenefits-TeluguStop.com

ఆ అలసటను తగ్గించుకోవటానికి పండ్ల రసాలు, నిమ్మరసం, షర్బత్, కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్లు వంటి వాటిని త్రాగుతూ ఉంటారు.అయితే రోజ్ షర్బత్ ని త్రాగితే చాలా తొందరగా అలసట తగ్గటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

ముందుగా రోజ్ షర్బత్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

బాగా పూసిన గులాబీ పువ్వును తీసుకోని దాని నుంచి గులాబీ రేకలను విడతీసి శుభ్రంగా కడగాలి.ఒక గిన్నెల్లో నీటిని పోసి బాగా మరిగించాలి.బాగా మరిగిన నీటిలో గులాబీ రేకులను వేసి గులాబీ రేకలు తెల్లగా అయ్యేవరకు మరిగించాలి.

ఈ నీటిని వడకట్టి కొంచెం రోజ్ ఎసెన్స్ కలపాలి.ఇష్టం ఉన్నవారు తేనే,నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెట్టుకొని కూల్ కూల్ గా త్రాగితే ఆ మజానే వేరు.ఇప్పుడు రోజ్ షర్బత్ త్రాగటం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

గులాబీ పూలలో ఎన్నో ఔషధ గుణాలు ఉండుట వలన శరీరానికి చాలా రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.శరీరంలో వేడిని తగ్గించి చల్లగా ఉండేలా చేస్తుంది.ఈ వేసవిలో వేసవి తాపం నుండి బయటపడవచ్చు.అంతేకాక డీహైడ్రేషన్ సమస్య రాకుండా కాపాడుతుంది.

ఎండ కారణంగా వచ్చే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి గ్యాస్,అసిడిటీ,మలబద్దకం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube