వందేళ్ల క్రితమే చనిపోయిన పాప.. ఇప్పటికి కళ్ళు తెరుస్తుంది.. అసలు విషయం ఇదే..

చనిపోయిన వారికి అంతిమ సంస్కరణలు చేయడం సహజం, ఈ అంతిమ క్రియలు ఒక్కో దేశం లో ఒక్కో లాగా ఉంటాయి.కొందరు మృత దేహాన్ని దహనం చేస్తే, మరికొందరు పూడ్చిపెడుతారు.

 Rosalia Lombardo The Mystery Of The Mummy Who Opens Her Eyes-TeluguStop.com

అయితే, మృత‌దేహాల‌ను ద‌హ‌నం చేయ‌కుండా, భూమిలో ఖ‌న‌నం చేయ‌కుండా మ‌మ్మీలుగా మార్చిన సంప్ర‌దాయాలు కూడా భూమిపై ఉన్నాయి.ఇలా మ‌మ్మీగా మార్చ‌బ‌డ్డ ఓ పాప ఇప్ప‌టికీ స‌జీవంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తుండ‌టం, క‌ళ్లు తెరిచి చూస్తున్న‌ట్లు ఉండ‌టం అంద‌ర్నీ షాక్ కి గురిచేస్తుంది.

ఇట‌లీ దేశంలో 1918లో రొజాలియో లాంబాడో అనే ఒక పాప జ‌న్మించింది.దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆ పాప రెండేళ్ల వ‌య‌సులోనే న్యుమోనియా బారిన‌ప‌డి మ‌ర‌ణించింది.అంత చిన్న వ‌య‌సులో రొజాలియో మ‌ర‌ణించ‌డాన్ని ఆమె తండ్రి జీర్ణించుకోలేక‌పోయాడు.ఆ పాప మృత‌దేహాన్ని ఖ‌న‌నం, ద‌హ‌నం చేయ‌కుండా సుర‌క్షితంగా ఉంచాల‌నుకున్నాడు.

ఆ ప‌నిని ఆల్ఫ్రెడో సెలానియా అనే వ్య‌క్తికి అప్ప‌గించాడు.సెలానియా ఎంబాల్మింగ్ ప్ర‌క్రియలో నిపుణుడు.

వందేళ్ల క్రితమే చనిపోయిన పాప

ఎంబాల్మింగ్ అనేది మృత దేహానికి చేసే ఒక ప్రక్రియ.ఈ ప్ర‌క్రియ‌లో మృతుల శ‌రీరంలోకి ప్ర‌త్యేక ద్ర‌వాన్ని ఎక్కిస్తారు.ఆపై కొన్ని ర‌సాయ‌నాల‌ను శ‌రీరంపై పూస్తారు.ఫ‌లితంగా శ‌రీరం కొన్నాళ్ల‌పాటు పాడ‌వ‌కుండా సుర‌క్షితంగా ఉంటుంది.జీవం ఉన్న‌ట్లే క‌నిపిస్తుంది.రొజాలియో మృతదేహాన్ని ఆల్ఫ్రెడో ఎంత చ‌క్క‌గా ఎంబాల్మింగ్ ప్ర‌క్రియ‌తో సంర‌క్షించాడంటే.

ఈరోజుకీ ఆమె శ‌రీరం చెక్కుచెద‌ర‌లేదు.అద్దంతో త‌యారుచేసిన శ‌వ‌పేటిక‌లో ఉన్న రొజాలియా మృత‌దేహం అత్యంత అంద‌మైన మ‌మ్మీగా పేరుగాంచింది.

స్లీపింగ్ బ్యూటీగానూ ఆ మృత‌దేహాన్ని పిలుస్తున్నారు.

వందేళ్ల క్రితమే చనిపోయిన పాప

ప్ర‌స్తుతం రొజాలియాను క్యాప‌చిన్ క్యాపిటాన్ మ్యూజియంలో ఉంచారు.స్లీపింగ్ బ్యూటీని చూసేందుకే అక్క‌డికి అధిక సంఖ్య‌లో సంద‌ర్శ‌కులు వ‌స్తుంటారు.వారిలో కొంత‌మంది రొజాలియా క‌ళ్లు ఆర్ప‌డం చూశామ‌ని చెప్ప‌డం సంచ‌ల‌నం సృష్టించింది.

దీంతో శ‌వ‌పేటిక వ‌ద్ద అధికారులు కెమెరాలు ఏర్పాటుచేసి ప‌రిశీలించారు.వాస్త‌వం తెలుసుకొని వారు కూడా అవాక్క‌య్యారు.

రొజాలియా క‌ళ్లు కొద్దిసేపు తెరిచి ఉండ‌టం, ఆపై పూర్తిగా మూసివేయ‌డం కెమెరాలో బంధించబడింది.రోజాలియా 100 ఏళ్ల క్రితమే చనిపోయినప్పటికి ఇప్పటికి కళ్ళు తెరిస్తూనే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube