దూసుకుపోతున్న మరో భారతీయ యాప్ ...!

గాల్వాన్ దగ్గర జరిగిన ఘర్షణ కారణంగా చైనాకు తగిన బుద్ధి చెప్పే ఈ క్రమంలో ప్రభుత్వం ఏకంగా 59 చైనా వాళ్లను నిషేధించిన సంగతి విదితమే.ఎప్పుడైతే చైనా యాప్ లు పని ముగిసిందో ఆ రోజు నుండి భారతీయ కంపెనీల పంట పండినట్లు అయింది.

 One More Trending App From India, Indian App, Roposo,chian Apps, Chingari, Share-TeluguStop.com

ఇప్పటికే భారతదేశ లోని చింగారి, రొపొసొ, షేర్ చాట్ లాంటి కొన్ని యాప్స్ డౌన్లోడ్ లతో దూసుకు వెళ్తున్నాయి.ఇక గురుగ్రామ్ నగరానికి చెందిన వీడియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రోపోసో ప్రస్తుతం ప్లేస్టోర్ లో డౌన్లోడ్ ల పరంగా దూసుకుపోతోంది.

అది ఎంతలా అంటే… కేవలం రెండు రోజుల్లో దాదాపుగా ఇరవై రెండు మిలియన్ల మంది ఈ యాప్ ను కొత్తగా డౌన్లోడ్ చేసారంటే పరిస్థితి ఇట్లనే అర్థమవుతుంది.రోపోసో యాప్ ను 2014 సంవత్సరంలో భారతదేశంలో పరిచయం చేశారు.

ప్రస్తుతం ఈ యాప్ ఏకంగా 12 ప్రాంతీయ భాషల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంది.ఈ యాప్ లో ప్రతి నెల దాదాపు ఒక లక్ష వీడియోల వరకు కొత్త వీడియోలు క్రియేట్ అవుతున్నాయి.

ప్రస్తుతం చైనా యాప్స్ నిలిపివేయడంతో తాజాగా భారత్ లో రోపోసో యాప్ ట్రెండింగ్ గా కొనసాగుతోంది.

Telugu Chian Apps, Chingari, Indian App, Roposo, Ropsoseo, Share Chat-

గత వారం రోజుల నుండి ఈ యాప్ డౌన్ లోడ్ లు అమాంతం పెరిగి పోతున్నాయి.అది కూడా ఎలా ఉందంటే ఒక్క గంటలో ఏకంగా ఐదు నుండి ఆరు లక్షల మంది కొత్త యూజర్లు యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు.ఈ విషయాన్ని రొపొసొ సీఈఓ మయాంక్ బంగాడియా తెలిపారు.

వీటితో పాటు భారత్ కు సంబంధించిన వివిధ రంగాల యాప్స్ డౌన్ లోడ్ ల విషయంలో పరుగులు పెడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube