రూటు మార్చిన కెసీఆర్... అసలు కారణమిదే?

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కెసీఆర్ లాంటి రాజకీయ అపరచాణక్యుడు లేడన్న మాట ఎవరూ కాదనలేని సత్యం.అయితే రాజకీయ వ్యూహాలు పన్నడంలో కెసీఆర్ ను మించిన వారు లేరు అనే విషయం మనకు తెలిసిందే.

 Root Changed Kcr ... What Is The Real Reaso Telangana Politics, Telangana Congre-TeluguStop.com

అయితే ఇటీవల వరి ధాన్యం కొనుగోళ్ళ వ్యవహారంలో బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసి బీజేపీని ఇరకాటంలోకి నెట్టి ఇప్పడు రైతు మహా ధర్నా తరువాత ఒక్కసారిగా అమరులైన రైతులకు ఎవరూ ఊహించని విధంగా మూడు లక్షల పరిహారం ప్రకటించి ఒక్కసారిగా అందరిని ఆశ్చర్య పరిచారు.అయితే ఈ సారి బీజేపీపై పెద్దగా విమర్శలు చేయకుండా ఏం చేయనున్నారనే విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఎందుకు ఇలా సడెన్ గా రూటు మార్చడానికి గల కారణమేమిటంటే బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ను ఇరుకున పెట్టి బీజేపీ ఇక రైతుల అంశంపై విమర్శించకుండా చేసి కేంద్రం పై ఎక్కుపెట్టిన పరిస్థితి ఉంది.

ఇక రానున్న రోజుల్లో పంట మార్పిడి, యాసంగిలో వరి సాగు తగ్గించడంపై నే టీఆర్ఎస్ దృష్టి పెట్టే అవకాశం ఉంది.

ఎందుకంటే ఇప్పుడు వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీని దోషిగా చూపెట్టడంలో విజయవంతమయిన కెసీఆర్ ప్రస్తుతం టీఆర్ఎస్ అనుకూల వాతావరణం ఉన్న తరుణంలో ఈ వాతావరణాన్ని కొనసాగించడానికి తగిన ప్రణాళికను కార్యాచరణను రూపొందించే అవకాశం ఉంది.అంతేకాక ఇక ఎన్నికలకు కూడా రోజురోజుకు సమయం దగ్గర పడుతున్న పరిస్థితుల్లో  ఇదే దూకుడును కెసీఆర్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లేకపోతే మరల టీఆర్ఎస్ వెనక్కి పడిపోయే ప్రమాదం ఉంది.టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నా అవి ప్రజల్లోకి మాత్రం వెళ్లలేక పోతున్నాయి.అందుకే ఇక రంగంలోకి దిగిన కెసీఆర్ ఇక ఇదే దూకుడును కొనసాగించే అవాకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube