రూమ్ హీటర్ తో వృద్ధురాలి ప్రాణం పోయింది!

ప్రస్తుతం చలి కాలం సందర్భంగా అందరూ చలి తీవ్రతతో వణుకుతున్నారు.చాలా మంది చలి మంటలు కూడా కాచుకుంటున్నారు.

 Room Heater, Old Lady, Died, Short Circuit, Hyderabad, Keshava Daley Apartment,-TeluguStop.com

ఈ చలి తీవ్రతతో వృద్ధులకు చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.ఇటీవలే వెచ్చదనం కోసం ఏర్పరుచుకున్న రూమ్ హీటర్ వల్ల వృద్ధురాలి ప్రాణం పోయిన ఘటన చోటు చేసుకుంది.

హైదరాబాద్ లోని పంజాగుట్ట సమీపంలో కేశవ డాలే అపార్ట్మెంట్ లో 101 ఫ్లాట్ లో రిషేంద్ర వేలూరి, 78 ఏళ్ళ అతని తల్లి నిర్మల తో నివాసముండేవారు.కాగా తనకు ఇటీవలే ఓ యువతి అమూల్య తో వివాహం జరుగగా వాళ్లు 5 వ అంతస్తులో వేరే ప్లాట్ లో ఉంటున్నారు.101 లో తన తల్లి మాత్రం ఒంటరిగా ఉండేది.ప్రస్తుతం చలికాలం సందర్భంగా తన తల్లి కు వెచ్చదనం కోసం తను పడుకునే మంచం పక్కన ఓ రూమ్ హీటర్ ను పెట్టించాడు.

కాగా తన తల్లికి రెండు కాళ్లు పనిచేయవు‌.దీంతో తన తల్లి కోసం రాణి అనే మహిళను పనులోకి తీసుకున్నాడు.

Telugu Hyderabad, Lady, Heater, Short Circuit-Telugu Health

ఇదిలా ఉంటే ఇంట్లో ఏర్పాటు చేసిన హీటర్ కు కరెంట్ సర్క్యూటు లో షాక్ వల్ల మంటలు చెలరేగాయి.దీంతో తన తల్లి ఉన్న మంచం సగం వరకు కాలిపోగా దాదాపు 40 శాతం అతిని తల్లి కి కాలింది.దీంతో ఉదయం పనులకు వచ్చిన రాణి ఇంట్లో చూడగానే మంచం మీద వున్న నిర్మల కదలలేని స్థితిలో ఉండటం చూసి వెంటనే సూపర్ వైజర్ రోహిత్ కు, అముల్యకు తెలిపింది.కాగా వాళ్ళు రూమ్ లోకి వచ్చేసరికి తను అప్పటికే చనిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న రిషేంద్ర వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రి కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube