13 ఏళ్ల తరువాత మళ్ళీ రొనాల్డో ఆ ఘనత సాదించాడుగా..!

ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ అయిన ఫుట్ బాల్ లో ఫేమస్ ఆటగాడైన క్రిస్టియానో రోనాల్డో తన ఖాతాలో మరొక అరుదైన రికార్డ్ నుసంపాదించుకున్నాడు.అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలో రోనాల్డో కూడా ఒకరుగా ఉన్నారు.

 Ronaldo, Football, Record, Goals,latest News-TeluguStop.com

తన ఆటతో ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణాభినందనాలను తన సొంతం చేసుకున్నారు.తాజగా పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డొ సెప్టెంబర్‌ నెలకు గాను ” ప్రీమియర్‌ లీగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ ” అనే అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఇంతకుముందు కూడా రొనాల్డో 2006 నవంబర్‌, డిసెంబర్‌ నెలకు గాను ఈ అవార్డును అందుకున్నాడు.

అలాగే 2008 జనవరి, మార్చి నెలలో కూడా రొనాల్డొ మాంచెస్టర్‌ యునైటెడ్‌ తరపున ఈ అవార్డు అందుకున్నాడు.

మళ్ళీ తాజాగా 13 ఏళ్ల గ్యాప్‌ తరువాత రొనాల్డొ మాంచెస్టర్‌ యునైటెడ్‌ తరపున ఈ అవార్డు గెలుచుకోవడం విశేషం అనే చెప్పాలి.రొనాల్డొ ఖాతాలో ఇది ఐదో ప్రీమియర్‌ లీగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ కావడం చెప్పుకోదగ్గ విషయం.

అలాగే రోనాల్డోతో పాటు ఆర్సెనల్‌ బాస్‌ మైకెల్ ఆర్టెటా సెప్టెంబర్‌ నెలకు గానూ మేనేజర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును కైవసం చేసుకున్నాడు.

Telugu Football, Goals, Ronaldo-Latest News - Telugu

మాంచెస్టర్ సిటీ డిఫెండర్ జోవో క్యాన్సెలో, చెల్సియా ఆంటోనియో రుడిగర్, న్యూకాజిల్‌ కు చెందిన అలన్ సెయింట్ – మాక్సిమిన్, లివర్‌పూల్ ఫార్వర్డ్ మొహమ్మద్ సలా, వాట్ఫోర్డ్ ఆటగాడు ఇస్మాయిలా లాంటి వారితో పోటీపడి మరి రొనాల్డో ఈ అవార్డు సాధించాడు.జువెంటస్‌ నుంచి మాంచెస్టర్‌ యునైటెడ్‌కు మారాకా రొనాల్డొ ఆరు మ్యాచ్‌ల్లో 5 గోల్స్‌ చేశాడు.ఈ ఐదింటిలో మూడు గోల్స్‌ సెప్టెంబర్‌ నెలలో వచ్చాయి.

రోనాల్డో కి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.వేగంగా ఫుట్ బాల్ గేమ్ ఆడగల సత్తా రోనాల్డో కి ఉంది కాబట్టే ఇతనిని రాకెట్ మాన్ అని కూడా పిలుస్తారు‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube