రొమాంటిక్ రివ్యూ: శృతిమించిన రొమాన్స్.. అదుర్స్ అనిపించుకున్న ఆకాష్ పూరీ!

అనిల్ పాదూరి దర్శకత్వంలో ఈరోజు తెరకెక్కిన సినిమా రొమాంటిక్‘ ఈ సినిమాను శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, నటి ఛార్మి కౌర్ నిర్మించారు.ఇందులో పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించాడు.

 Romantic Review Next Level Romance In Movie And Akash Puri Looks Good Romantic,-TeluguStop.com

కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.ఇందులో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటించింది.

ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతంను అందించాడు.భాస్కర్ బట్ల, పూరి జగన్నాథ్ పాటలు అందించారు.ఇక ఈ రోజు ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం.

కథ:

ఇక ఈ సినిమా కథ ఏమిటంటే.ఈ సినిమాలో రమ్యకృష్ణ రమ్య గోవారికర్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.ఇక ఆకాష్ పూరి వాస్కోడగామా అనే స్మగ్లర్ గా కనిపిస్తాడు.ఈ కథ గోవా నుంచి ప్రారంభమవుతుంది.అలా వాస్కోడగామా రౌడీ గ్యాంగ్ లో చేరుతాడు.

ఆ గ్యాంగ్ తో ఉంటూ బాగా డెవలప్ అవుతున్నాడు.అదే సమయంలో అతడికి కేతిక శర్మ మౌనిక అనే పాత్రతో పరిచయం అవుతుంది.

దీంతో వీరి మధ్య సన్నిహితం ఏర్పడటంతో ప్రేమగా మారుతుంది.ఇక ఆ ప్రేమ నిజమా లేదా అబద్దమా అనేది అంతేకాకుండా వాస్కోడగామా తను చేసిన తప్పుల నుంచి ఎలా బయటపడతాడు అనేది చివరికి మౌనికను కలుస్తాడా లేదా అనేది ఈ సినిమాలో మిగిలిన కథలో చూడవచ్చు.

Telugu Akash Puri, Anil Madhuri, Kethi Sharma, Review, Ramya Krishna, Romantic,

నటినటుల నటన:

ఆకాష్ తాను ఇంతకు ముందు నటించిన సినిమాలకంటే ఈ సినిమాలో తన నటన బాగా ఆకట్టుకుంది.కేతిక శర్మ ఈ సినిమాకు తొలిసారిగా పరిచయం అయిన కూడా తొలిసారి నటనతో బాగా నటించింది.రమ్యకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మాత్రం ఫిదా చేసిందని చెప్పవచ్చు.మిగతా నటీనటులు కూడా తమ పాత్రలతో బాగా మెప్పించారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.ఈ సినిమాకు కథను అద్భుతంగా తెరకెక్కించారు.

సునీల్ కష్యప్ తన మ్యూజిక్ తో ప్లస్ పాయింట్ గా మార్చాడు.డైరెక్టర్ అనిల్ మాధురి తొలిసారిగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కూడా అనుభవమున్న దర్శకుడిగా సినిమాను బాగా రూపొందించాడు.

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.

Telugu Akash Puri, Anil Madhuri, Kethi Sharma, Review, Ramya Krishna, Romantic,

విశ్లేషణ:

ఈ సినిమాకు డైరెక్టర్ కథను అద్భుతంగా రూపొందించాడు.యువతకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.పైగా బోర్ కొట్టకుండా ఈ సినిమా బాగా కొనసాగింది.

కథలో కాస్త కొత్తదనం కూడా అనిపించింది.

Telugu Akash Puri, Anil Madhuri, Kethi Sharma, Review, Ramya Krishna, Romantic,

ప్లస్ పాయింట్స్: ఈ సినిమాలో ప్లస్ పాయింట్ గా హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు అని తప్పకుండా చెప్పవచ్చు. డైలాగ్స్ కూడా బాగా మెప్పించాయి.ఎలివేషన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్: మైనస్ పాయింట్ గా అంతగా ఏమీ అనిపించలేదు.కానీ అక్కడ అక్కడ పూరి మార్క్ కనిపించడం లేదని అర్థమవుతుంది.

బాటమ్ లైన్:

ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ బాగా హైలెట్ గా నిలిచాయి.పైగా యువతకు బాగా కనెక్ట్ అయ్యే సినిమాలా ఉంది కాబట్టి ఈ సినిమా థియేటర్ లో చూడటానికి అస్సలు వెనుకాడదు.

రేటింగ్: 2.5/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube