ఎంత మొత్తుకున్నా రౌడీ స్టార్‌ అవ్వలేవు ఆకాష్‌

Romantic Movie Hero Akash Puri Speech At Pre Release Function

ఈమద్య కాలంలో యంగ్‌ హీరోలు కాస్త ఎగ్రసివ్‌ అయ్యి జనాల్లో మంచి పేరు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.చాలా మంది హీరోలు వాయిస్ పెంచడం ద్వారా జనాల్లో క్రేజ్ ను దక్కించుకోవాలని ఉబలాట పడుతున్నారు.

 Romantic Movie Hero Akash Puri Speech At Pre Release Function-TeluguStop.com

విజయ్ దేవరకొండ అలా జనాల్లో తనదైన శైలిలో మాట్లాడుతూనే యూత్‌ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు.ముందు ముందు ఆయన చేస్తున్న సినిమాల కోసం కూడా జనాలు ఇంతగా ఎదురు చూస్తున్నారు అంటే కారణం ఖచ్చితంగా ఆయన స్పీచ్ లు అనడంలో సందేహం లేదు.

అందుకే ఆయన తెలుగు లో స్టార్‌ హీరోగా మారిపోయాడు.ఆయన దారిలో కొందరు హీరోలు నడిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 Romantic Movie Hero Akash Puri Speech At Pre Release Function-ఎంత మొత్తుకున్నా రౌడీ స్టార్‌ అవ్వలేవు ఆకాష్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అభిమానులను రౌడీస్‌ అంటూ విజయ్ దేవరకొండ పిలిచినట్లుగా కొందరు తమ అభిమానులను ఆసక్తికరంగా పిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు.

ఇప్పుడు రౌడీ స్టార్‌ రూట్‌ ను ఫాలో అవుతూ అందరి దృష్టిలో పడేందుకు గాను ఆకాష్‌ పూరి ప్రయత్నాలు చేస్తున్నాడు.

 తన రొమాంటిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా ఆకాష్‌ మాట్లాడిన మాటలు అందరిని ఆకట్టుకున్నాయి.తన కెరీర్‌ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసిన వాడికి ఇదే చెప్తున్నా అంటూ తన వాయిస్ ను గట్టిగా పెంచడం చర్చనీయాంశంగా మారింది.

అంతే కాకుండా తన తండ్రి కాలర్ ఎగురవేసుకునేలా నేను ఇక్కడ ఉంటాను అంటూ బల్లగుద్ది మరీ చెప్పాడు.

Telugu Akash Puri, Akashpuri, Pre, Puri Jaganadh, Romantic, Rowdy-Movie

అంతే కాకుండా నా తండ్రి ని అనేంత దమ్ము ధైర్యం ఎవరికి లేవు అంటూ కాస్త ఓవర్‌ గానే మనోడు వాయించాడు.ఇంతగా మాట్లాడటం వెనుక ఎవరి ట్రైనింగ్‌ ఉండి ఉంటుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.విజయ్‌ దేవరకొండ గత స్పీచ్ లను చూసి ఇలా మాట్లాడావా లేదంటే పూరి సర్‌ ట్రైనింగ్‌ ఇచ్చాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు మాత్రం నువ్వు అంతగా మొత్తుకున్నా కూడా రౌడీ స్టార్ రేంజ్ లో స్టార్‌ డమ్‌ దక్కించుకోలేవు అంటున్నారు.కాని తాజా ప్రీ రిలీజ్ వేడుకలో ఆకాష్‌ మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంది.

#AkashPuri #Romantic #Rowdy #Pre #Puri Jaganadh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube