'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నిత్యామీనన్‌ పాత్ర ఏంటో తెలిసి పోయింది  

Role Of Nithya Menen In Rrr Has Leaked-

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు ఈ చిత్రంలో నటిస్తున్నారు.ఆలియా భట్‌తో పాటు ఒక విదేశీ హీరోయిన్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు...

Role Of Nithya Menen In Rrr Has Leaked--Role Of Nithya Menen In RRR Has Leaked-

ఇక ఇదే చిత్రంలో నిత్యామీనన్‌ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇటీవలే ఒక పాత్ర కోసం నిత్యామీనన్‌తో సంప్రదింపులు జరిపారని, త్వరలోనే సినిమాలో ఆమె నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందింది.

ఇక చిత్రం షూటింగ్‌ సమయంలో నిత్యామీనన్‌ చేస్తున్న పాత్ర ఏంటీ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

Role Of Nithya Menen In Rrr Has Leaked--Role Of Nithya Menen In RRR Has Leaked-

ఈ సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నిత్యామీనన్‌ పాత్ర ఎన్టీఆర్‌ పోషిస్తున్న కొమురం భీం పాత్రకు సన్నిహితంగా ఉంటుందని తెలుస్తోంది.కొమురం భీంకు ముగ్గురు భార్యలు అనే సమాచారం ఉంది.అందుకే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు నిత్యామీనన్‌ ను భార్యగా కాకుండా ఒక ఆరాధించే వ్యక్తిగా చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్‌ మరియు నిత్యామీనన్‌ల మద్య సీన్స్‌ బాగుంటాయని, ఎన్టీఆర్‌ రొమాంటిక్‌గా నిత్యామీనన్‌తో ఉంటాడనే టాక్‌ కూడా వస్తుంది.మొత్తానికి ఈ చిత్రంలో ట్యాలెంటెడ్‌ నటి అయిన నిత్యామీనన్‌ నటించడం సినిమాపై అంచనాలు మరింతగా పెంచేలా చేస్తుంది.తప్పకుండా ఈచిత్రం ఒక రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేస్తుందనే నమ్మకంతో అంతా ఉన్నారు.

మరి ఈ చిత్రం ఎలా ఉంటుంది అనేది చూడాలి.ప్రస్తుతం ఈ చిత్రం చిన్న గ్యాప్‌ తర్వాత షూటింగ్‌ మళ్లీ మొదలు అయ్యింది.త్వరలోనే ఈ షెడ్యూల్‌ పూర్తి అయ్యే అవకాశం ఉంది.