'మహర్షి' చిత్రంలోని అల్లరి నరేష్‌ పాత్ర గురించి వచ్చే వార్తలు నిజమేనా?.. నిజమే అయితే కష్టమే  

Role Of Allari Naresh In Maharshi-allari Naresh,friend,maharshi,mahesh Babu,movie Updates,release,role,shooting

సూపర్‌ స్టార్‌ ప్రతిష్టాత్మక 25వ చిత్రం ‘మహర్షి’ విడుదలకు సిద్దం అవుతోంది. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ చిత్రంకు సంబంధించిన చివరి దశ షూటింగ్‌ను చకచక పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్‌బాబుకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో అల్లరి నరేష్‌ నటిస్తున్న విషయం తెల్సిందే..

'మహర్షి' చిత్రంలోని అల్లరి నరేష్‌ పాత్ర గురించి వచ్చే వార్తలు నిజమేనా?.. నిజమే అయితే కష్టమే-Role Of Allari Naresh In Maharshi

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ పాత్ర చనిపోతుందని, స్నేహితుడి మరణంకు మహేష్‌ బాబు రివేంజ్‌ తీర్చుకునేందుకు ఇండియాకు వస్తాడనేది కథ అంటూ కొందరు చెబుతున్నారు.

మహర్షి చిత్రంలో అల్లరి నరేష్‌ చనిపోతాడంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, అసలు అలాంటి ఛాన్స్‌ లేదని చిత్ర యూనిట్‌ సభ్యులు అనఫిషియల్‌గా చెబుతున్నారు. సినిమా కథను మీకు మీరు ఎలా అలా ఊహించుకుంటారు.

మహర్షి చిత్రం గురించి మీడియాలో వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ వారు చెబుతున్నారు. సినిమా కథ చాలా బాగుంటుందని, పాజిటివ్‌ బజ్‌ తో సాగుతుందని చెబుతున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా, చాలా వినోదభరితమైన స్క్రీన్‌ప్లేతో, ఆకట్టుకునే క్లైమాక్స్‌తో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు.

మహేష్‌బాబు ఈ చిత్రం కోసం మొదటి సారి గడ్డం మరియు మీసాలతో కనిపించబోతున్నాడు. దాంతో పాటు మహేష్‌బాబు నటించిన గత చిత్రాల్లో ఇలా మరో హీరో కీలక పాత్రలో కనిపించింది లేదు. కనుక ఇది చాలా ప్రత్యేకమైన సినిమాగా ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. అన్ని వర్గాల వారిలో కూడా మహర్షి చిత్రంపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను మే మొదటి వారంలో విడుదల చేయబోతున్నారు.