రోజులు మారాయి రివ్యూ

చిత్రం : రోజులు మారాయి

 Rojulu Marayi Movie Review-TeluguStop.com

బ్యానర్ : గుడ్ సినిమా గ్రూప్

దర్శకత్వం : మురళికృష్ణ

నిర్మాత : జి.శ్రీనివాస్ రావు

సంగీతం : జేబి

విడుదల తేది : జలై 1, 2016

నటీనటులు : చేతన్ మద్దినేని, కృతిక జయకుమార్, తేజస్వీ, పార్వతీశం, ఆలీ తదితరులు

ఈరోజుల్లో, ప్రేమకథాచిత్రమ్, బస్టాప్ వంటి యువత మెచ్చిన సినిమాలు అందించిన మారుతీ, తన శిష్యుడు మురళీకృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చిన సినిమా “రోజులు మారాయి”.ఈ చిత్రానికి అగ్రనిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించడంతో ట్రేడ్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథలోకి వెళ్తే …

అశ్వత్ (చేతన్) ప్రాణానికి ప్రాణంగా ఆధ్య (కృతిక) ని ప్రేమిస్తుంటాడు.తనకి కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా కొంటూ ఉంటాడు.

కాని అవసరం కోసం అశ్వత్ ని వాడుకుంటూ, విక్కి అనే మరో అబ్బాయిని ప్రేమిస్తుంది ఆధ్య.ఇటువైపు పీటర్ (పార్వతీశం) రంభ (తేజస్వీ) మీద ఆశలు పెంచుకుంటాడు.

కాని రంభ ఎదుటి ఆఫీసులో డైరెక్టర్ ని ప్రేమిస్తూ పీటర్ ని వాడుకుంటుంది.

స్నేహితురాళ్లైన ఆధ్య,రంభ ఇద్దరి జాతకచక్రం ఒకేలా ఉంటుంది.

వారి జాతకం ప్రకారం పెళ్ళి చేసుకున్న మూడురోజుల్లోనే భర్త చనిపోతాడు.ఇలాంటి చిక్కులో తాము ప్రేమిస్తున్నట్టు నటిస్తున్న అశ్వత్, పీటర్ లను పెళ్ళి చేసుకోని, వారు చనిపోగానే నిజంగా ప్రేమిస్తున్న అబ్బాయిలను పెళ్ళి చేసుకోవాలనే ప్లాన్ వేస్తారు ఇద్దరు అమ్మాయిలు.

మరి వారి ప్లాన్ ఫలించిందా ? ఆధ్య, రంభ తమని ప్రేమించినవారికి దగ్గరయ్యారా లేక తాము ప్రేమించినవారికి దగ్గరయ్యరా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన గురించి

చేతన్ చాలా అసౌకర్యంగా కనిపించాడు.

అది ఎంత అంటే, చాలావరకు లాంగ్ షాట్స్ పెట్టి కవర్ చేసేంత.హావభావాలు కాని, డైలాగ్ డెలివరి కాని ఏమాత్రం ఆసక్తికరంగా లేవు.

ఇక కృతిక జయకుమార్ నటన దృశ్యం చిత్రంలో చేసిన పాత్రకు కొనసాగింపులా ఉంది.కాకపోతే కనిపించినంత సేపు అందంగా కనిపించింది.

ఇక తేజస్వీ ఈ సినిమా లీడ్ కాస్టింగ్ లో అనుభవం ఉన్న నటి.మిగితా మగ్గురికి తనకి ఆ తేడా స్పష్టంగా కనబడింది.పార్వతీశం కొన్నిసార్లు నవ్విస్తాడు, కొన్నిసార్లు నవ్వించడానికి విఫలయత్నం చేస్తాడు.ఆలీ పాత్ర పూర్తిగా తేలిపోయింది.

సాంకేతికవర్గం పనితీరు

జేబి సంగీతం గుర్తుపెట్టుకునే రేంజిలో లేకపోయినా, సినిమాలో వింటున్నంత వరకు బాగానే ఉంది.ఉద్ధవ్ ఎడిటింగ్ షార్ప్ గా లేదు.

చాలా సన్నివేశాలు విసుగు పుట్టిస్తాయి.సినిమా రన్ టైమ్ చిన్నదే అయినా, మూడు గంటల సినిమా చూస్తున్నామా అనే భ్రమ కలుగుతుంది.

సినిమాటోగ్రాఫి ఫర్వాలేదు.మారుతి అందించిన కథ గురించి కాని, స్కీన్ ప్లే గురించి కాని పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదు.

నిర్మాణ విలువలు ఫర్వాలేదు.

విశ్లేషణ

అప్పట్లో వచ్చిన ప్రేమకథచిత్రమ్ ఒక సంచలనం.

హర్రర్ లో కామెడి అనే ప్రయోగాన్ని తెలుగుతెరపై చక్కగా చూపించి భారి లాభాలు సంపాదించుకున్నారు మారుతి ఆండ్ కో.దాని ప్రభావం ఈ సినిమా మీద చాలావరకు పడింది.కాని ప్లాన్ సరిగా అమలుపరచలేకపోయారు.ఈసారి హర్రర్ కామెడి పూర్తిగా బెడిసికొట్టింది.భయపెట్టడానికి ప్రయత్నించారు.కాని భయం వేయదు.

నవ్వించటానికి ప్రయత్నించారు.కాని నవ్వు రాదు.

ఎంచుకున్న కథాంశమే చాలా వీక్.దాన్ని తీసిన విధానం ఇంకా వీక్.

చిత్రంలో కాస్తంత ఆసక్తి కలిగించే లేదా నవ్వించే ఎపిసోడ్లు ఏమైనా ఉన్నాయి అంటే, అవి దృశ్యం సినిమాను పేరడి చేసిన సన్నివేశాలే.ఇంటర్వెల్ ని ఒక ట్విస్టుతో ముగించామని రచయిత, దర్శకుడు భ్రమపడి ఉండవచ్చు కాని, ప్రతీ సాధారణ ప్రేక్షకుడికి ఇంటర్వల్ ట్విస్టుతో పాటు క్లయిమాక్స్ కూడా చాలా సునాయాసంగా ఇంటర్వెల్ లోనే తెలిసిపోతుంది.

చివర్లో ఏం జరగబోతోందో గంట ముందే తెలిస్తే ఇక ప్రేక్షకుడు సినిమాలో చూడడానికి ఏముంటుంది.

హైలైట్స్ :

* దృశ్యం పేరడి

* కొన్ని కామెడి సన్నివేశాలు

డ్రాబ్యాక్స్ :

* కాస్టింగ్

* కథ, స్క్రీన్ ప్లే

* ఆసక్తికరంగా లేని ట్విస్ట్‌లు

* అనవసరపు సన్నివేశాలు
* పేలని కామెడి

* సెకండాఫ్ మొత్తం మొదటి అయిదు, పది నిమిషాల్లోనే అర్థమయిపోవడం

చివరగా :

చిత్రంలో నటించినవారి రోజులు అప్పుడే మారడం కష్టం.మారుతి, దిల్ రాజు మీద నమ్మకంతో ప్రయత్నించడం మీ ఇష్టం.

తెలుగుస్టాప్ రేటింగ్ : 1.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube