రోజాకు మంత్రి పదవి వస్తే వారికి ఇబ్బందా ? అందుకే అడ్డుకుంటున్నారా ?

ఈనెల 18వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి.ఇప్పటికే వైసీపీ మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కాబోతున్నారు.

 In Case Of Roja Getting Minister Post Rayalaseema Two Ministers Suffering That I-TeluguStop.com

వారి ఎన్నిక పూర్తి అయిన తరువాత వారు తమ మంత్రి పదవులకు తప్పకుండా రాజీనామా చేస్తారు.దీంతో రెండు క్యాబినెట్ సీట్లు ఖాళీ అవుతాయి.

దీంతో పాటు ఏపీ మంత్రివర్గంలో ఉన్న కొంత మంది మంత్రుల పనితీరుపై జగన్ చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు.వారిని తప్పించి క్యాబినెట్ ప్రక్షాళన చేసి మరికొంత మంది కొత్తవారిని కేబినెట్ లోకి తీసుకోవాలని జగన్ ఆలోచనలో ఉన్నట్లుగా వైసీపీలో ప్రచారం జరుగుతోంది.

దీంతో ఆశావహులు చాలామంది మంత్రి పదవులు దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.

అసలు రోజాకు మొదటి మంత్రివర్గ విస్తరణ లోనే కీలకమైన మంత్రి పదవి దక్కాల్సి ఉన్నా, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమె పేరును జగన్ తప్పించి ఆమె అసంతృప్తికి గురి అవకుండా ఆ తర్వాత ఏపీ ఏఐసీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.

రోజాకి మంత్రి పదవిపై మనసు ఉండడంతో ఎప్పటికైనా మంత్రి అవ్వాలనే కోరికతో ఉన్నారు.ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు.

కాకపోతే రోజాను మంత్రివరలోకి తీసుకుంటే తమ హవాకు గండి పడుతుంది అనే ఆలోచనతో ఉన్న రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు మంత్రులు రోజాకి మంత్రి పదవి దక్క కుండా తెరవెనుక మంత్రాంగం చేస్తున్నట్లు ఇప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయి.

Telugu Mopidevi, Pillisubash, Rajyasabha, Rayalaseemaycp, Roja, Ycp Ministers-Po

ఈ విషయంపై గత కొంతకాలంగా వైసీపీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.రోజా వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే.ఆమె వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తూ వచ్చారు.

తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, పార్టీకి బలమైన వాయిస్ వినిపించేవారు.ఇక జగన్ కూడా ఆమెకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ వచ్చారు.

ఇప్పుడు కొత్తగా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రోజా పేరును జగన్ పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.రోజా మాత్రం జగన్ తనకు తప్పకుండా న్యాయం చేస్తారని, తాను మంత్రి అవుతానని తన అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారట.

ఈ విషయంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube