పుష్ప సినిమాలో లేడీ విలన్ గా వైసీపీ మహిళా ఎమ్మెల్యే  

Roja Will Become Lady Villain In Pushpa Movie - Telugu Allu Arjun,, South Cinema, Sukumar, Telugu Cinema, Tollywood

సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూడో సినిమా పుష్ప.గత రెండు సినిమాలకి భిన్నమైన నేపధ్యంలో పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది.

 Roja Will Become Lady Villain In Pushpa Movie

చిత్తూరు నేపధ్యంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ కథాంశంతో సినిమా ఉండబోతుంది అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్రల కోసం చాలా రోజులుగా రకరకాల కథనాలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది.

పుష్ప సినిమాలో లేడీ విలన్ గా వైసీపీ మహిళా ఎమ్మెల్యే-Movie-Telugu Tollywood Photo Image

అది కూడా లేడీ విలన్ పాత్ర కోసం.ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రోజా శెల్వమణి ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చి మొగుడు, గోలీమార్ సినిమాలు చేసింది.

ఆ రెండు సినిమాలలో రోజా పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి.

అయితే పుష్ప సినిమాలో యాంటీ షేడ్స్ ఉన్న పాత్ర కోసం తాజాగా దర్శకుడు సుకుమార్ రోజాని సంప్రదించడం జరిగిందని తెలుస్తుంది.

ఇక రోజా కూడా పాత్ర ప్రాధాన్యత బట్టి చేయడానికి ఆసక్తిగానే ఉన్నారని చెప్పుకుంటున్నారు.అయితే ఆ పాత్ర చేస్తే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తనకి వ్యక్తిగతంగా ఇబ్బంది అవుతుందేమో అనే ఆలోచనతో రోజా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

అలాగే విజయశాంతిని కూడా ఈ పాత్ర కోసం సంప్రదించడం జరిగిందని, అయితే విలన్ పాత్రలు చేయడానికి ఆమె పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే మాటల వినిపిస్తుంది.ఏది ఏమైనా ఈ పవర్ ఫుల్ విమెన్ విలన్ పాత్ర కోసం అవకాశం ఉంటే రోజాని లేదంటే పాత హీరోయిన్ ని తీసుకోవాలని సుకుమార్ భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Roja Will Become Lady Villain In Pushpa Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test