రోజమ్మకు గ్రూపుల తలనొప్పి ? జగన్ జోక్యం చేసుకుంటారా ? 

జగన్ కు అత్యంత స్నేహితురాలుగా ముద్రపడిన నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కు సొంత నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ఇబ్బందికరంగా మారాయి.నగరిలో రోజా కు వ్యతిరేకంగా రెండు గ్రూపులు పనిచేస్తుండటం, ప్రతి దశలోనూ రోజా హవాకు చెక్ పెట్టే విధంగా సొంత పార్టీ నాయకులు వ్యవహారాలు చేస్తుండడం, వేరువేరుగా సభలు సమావేశాలు నిర్వహిస్తుండడం, రాబోయే ఎన్నికల్లో రోజాకు నగరి ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశం లేదని,  తమకు ఎమ్మెల్యే సీటు రాబోతోంది అంటూ, సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తుండడం ఇబ్బందికరంగా మారింది.

 Nagari Mla,ek Roja, Ysrcp, Jagan Troubles, Ap Cm Jagan, Ysrcp Group Politics, Pe-TeluguStop.com

చివరకు జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించే విషయమై ప్రత్యర్థి వర్గం అంతా ఏకమై విడిగా సమావేశం నిర్వహించుకోవడం, ఇవన్నీ నగరి వైసీపీ లో ఉన్న గ్రూపు రాజకీయాలను తెర పైకి తీసుకువస్తున్నాయి.

గతంలో ఈ వ్యవహారాలపై జగన్ వరకు ఫిర్యాదులు వెళ్లడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ వ్యవహారాలను చక్కదిద్దారు.

  రోజాకు ఇబ్బంది లేకుండా గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టారు.అయితే ఇది మూడు నెలలు ముచ్చటగానే మారిపోయింది.

రోజాను ఇంకా తెలుగుదేశం నాయకురాలు గానే సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తుండడం తలనొప్పిగా మారింది.జగన్ పుట్టినరోజు సందర్భంగా రోజా ప్రత్యర్థి వర్గం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టించారు.

  అయితే వాటిని రాత్రికి రాత్రి కొంతమంది చించి వేయడంతో ఇదంతా రోజా వర్గం పనేనని వారు ఆరోపణలు చేస్తున్నారు.  ఈ ఫ్లెక్సీల వ్యవహారం పై మాజీ ఎంపీపీ ఏలుమలై ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ధర్నా నిర్వహించారు.

Telugu Ap Cm Jagan, Ek Roja, Jagan Troubles, Nagari Mla, Ysrcp-Telugu Political

ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఆయనకు మద్దతుగా చక్రపాణి రెడ్డి, కేజే కుమార్, మురళి రెడ్డి, రవిశేఖర్ రాజులతో పాటు అనేక మంది మద్దతు నిలబడ్డారు.ఈ సందర్భంగా వారు రోజా వర్గీయులపైనే విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ విధంగా బహిరంగంగానే నియోజకవర్గంలో వైసీపీ లో గ్రూపు రాజకీయాలు బయటపడుతూ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుండడంతో,  ఈ వ్యవహారం జగన్ వరకు వెళ్ళినట్లు సమాచారం.దీంతో ఇప్పుడు ఈ నియోజకవర్గంపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించి పూర్తిగా ప్రక్షాళన చేపడతారని, లేదా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా అన్ని గ్రూపులను ఒక చోట చేర్చి వారి మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube