రోజా బాధ జగన్ కు పట్టడం లేదే ? పక్కన పెట్టేశారా ?  

Rk roja jagan nagari mla ysrcp ,roja, ys jagan, roja tension, ys jagan ignoring roja, ycp leaders, privilege committee, tdp senior leaders - Telugu Apiicc Chairmen, Chandrababu, Chitturu, Jagan, Minister, Nagari Mla, Pedhireddi Ramachendrareddy, Privilege Committee, Rk Roja, Rk Roja Jagan Nagari Mla Ysrcp, Roja, Roja Tension, Tdp, Tdp Senior Leaders, Ycp Leaders, Ys Jagan, Ys Jagan Ignoring Roja, Ysrcp

వైసీపీ తరఫున ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ముద్రపడిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పరిస్థితి  రాజకీయంగా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నట్టుగానే కనిపిస్తోంది.వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ముద్ర వేయించుకున్న రోజా కు వైసీపీలో మొదటి నుంచి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.2014 లో వైసీపీ తరఫున మొదటిసారిగా గెలిచిన రోజు అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, వైసీపీ కి అండగా తన వాయిస్ వినిపిస్తూ వచ్చేవారు.అసెంబ్లీలోనూ బయట నేరుగా చంద్రబాబు పైన, తెలుగుదేశం కీలక నాయకులు అందరి పైన విమర్శలు చేస్తూ, అధికార పార్టీ గా ఉన్న టిడిపిని అడుగడుగునా ఇరుకున పెడుతూ చేసే విమర్శలు వైసీపీకి మంచి ఊపు తీసుకు వచ్చేవి.

TeluguStop.com - Roja Tension Over Ycp Leaders And Ys Jagan Ignorance

రోజా ధాటికి టిడిపి బెంబేలెత్తి పోయే పరిస్థితి అప్పట్లో నెలకొంది.ఇక దీంతో వైసీపీ లో రోజా హవా మరింతగా పెరుగుతూ వచ్చింది.
జగన్  అత్యంత సన్నిహితురాలిగా ఆమె ముద్ర వేయించుకోవడం తో 2019 ఎన్నికల్లోనూ రోజా నగరి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని అఖండ మెజారిటీతో విజయం సాధించారు.ఇక తొలిదశలోనే ఆమెకు మంత్రి పదవి ఖాయమని, కీలకమైన పదవిని కట్టబెట్టబోతున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగినా, జగన్ సామాజికవర్గాల లెక్కల్లో పక్కన పెట్టారు.

అయితే ఏపీ ఐ సి సి చైర్మన్ గా ప్రాధాన్యమున్న పదవుల్లో ఆమెను నియమించినా,  వైసీపీ లోని కీలక నాయకులు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన వైసీపీ నాయకులు రోజాకు అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తూ, ఆమెను పక్కన పెడుతూ వస్తుండడం,  జగన్ కు అత్యంత సన్నిహితమైన మంత్రి ఒకరు రోజా హవా పెరగకుండా అడుగడుగున అడ్డం పడుతూ వస్తోంది.

TeluguStop.com - రోజా బాధ జగన్ కు పట్టడం లేదే పక్కన పెట్టేశారా -Political-Telugu Tollywood Photo Image

ఇలా ఎన్నో కారణాలతో ఇప్పుడు ఆమెకు వైసీపీలో పెద్దగా ప్రాధాన్యం లేనట్టుగానే వ్యవహారం నడుస్తోంది.అదీకాకుండా నగరి నియోజకవర్గంలో స్వపక్షం లోని తన వ్యతిరేక వర్గానికి కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వడం రోజా జీర్ణించుకోలేకపోతున్నారు.అదికాకుండా ఇతర నియోజకవర్గాల్లోని మంత్రులకు , ఎమ్మెల్యేలకు తన నియోజకవర్గంలో రత్నం చేస్తుండడం  పైన ఆమె రగిలిపోతున్నారు.

ఈ వ్యవహారాలపై ఇటీవల జగన్ కు రోజా ఫిర్యాదు చేసినా ఫలితం లేక పోవడం, జగన్ సైతం ఆమెను పక్కన పెట్టినట్లు వ్యవహరిస్తున్నట్లు రోజాకు సంకేతాలు ఉండడంతో ఆమెలో మరింత ఆందోళన కనిపిస్తోంది.ఇటీవల చోటు చేసుకున్న వ్యవహారాలపై ప్రివిలేజ్ కమిటీకి రోజా ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించకపోవడంతో ఆమె మరింతగా అసంతృప్తితో ఉన్నారట.

#RkRoja #Nagari MLA #Chitturu #RK Roja #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు