రోజా జబర్దస్త్ పంచ్ : సింహంతో వేట జగన్ తో ఆట ' అంటూ...? 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ను విమర్శించేందుకు ఎప్పుడు ఉత్సాహం చూపిస్తుంటారు వైసిపి నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి రోజా ఇదే విధంగా విమర్శించే వారు .

 Rk Roja, Tdp , Chandrababu, Jagan, Ap, Roja Sensational Comments,  Roja Comments-TeluguStop.com

తాజాగా వెలువడిన మున్సిపల్,  కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టిడిపి దర్శి మినహా మిగతా అన్నిచోట్ల ఘోర పరాజయం పాలవడం, అలాగే చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే రకమైన ఫలితం వెలువడడం తదితర పరిణామాలన్నింటినీ ప్రస్తావిస్తూ రోజా చంద్రబాబు లోకేష్ పై విమర్శలు గుప్పించారు.ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ను పొగడ్తల తో ముంచెత్తారు.

వైసీపీ ప్రభుత్వం మహిళలకు అన్నివిధాలుగా అండగా నిలబడుతుందని,  గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తున్నారని,  పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి , రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల ఇళ్లను మహిళలు పేరుతోనే ఇచ్చారని రోజా జగన్ ను కొనియాడారు.

ఈ సందర్భంగా చంద్రబాబు లోకేష్ ను ఉద్దేశించి సెటైర్లు వేశారు.14 ఏళ్లుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు మహళలను పట్టించుకోలేదని సీఎం జగన్ మాత్రం రెండేళ్లలోనే మహిళలకు అండగా నిలబడుతునే వచ్చారని చెప్పుకొచ్చారు.చంద్రబాబును కుప్పం ప్రజలు తరిమితరిమి కొట్టారని,  ఇకపై అక్కడ చంద్రబాబు పప్పులు ఉదకవు అంటూ సెటైర్లు వేశారు.

కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డా కాదని,  ఐస్ గడ్డల మాదిరిగా కరిగిపోతుందని రోజా విమర్శించారు.ఢిల్లీలో చక్రం తిప్పాను అని చెప్పిన చంద్రబాబు గల్లీలో ప్రచారం చేసినా ఫలితం దక్కలేదని విమర్శించారు.

Telugu Ap Cm Jagan, Bjp Cm, Chandrababu, Jagan, Nagari Mla, Lokesh, Rk Roja, Roj

సింహంతో ఆట .వైఎస్ జగన్ తో ఆట అంత ఈజీ కాదు అని ఆమె వ్యాఖ్యానించారు.ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత కూడా చంద్రబాబు లోకేష్ లో ఎటువంటి మార్పు రాలేదని , ఎన్ని సవాళ్లు విసిరినా, జగన్ ను ఏమీ చేయలేరని రోజా మండిపడ్డారు.జగన్ తో పోటీ పడాలని లావు తగ్గిన లోకేష్ కు కొవ్వు మాత్రమే  తీశారా లేక మరేదైనా తీశారా అని రోజా వ్యంగ్యంగా ప్రశ్నించారు.

ఈ మధ్య వీరిద్దరూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube