ఇటీవల చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.ఎవరి పాపం అన్న వారే పోయారు అన్న తరహాలో భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి.
ఇటువంటి తరుణంలో భువనేశ్వరి వ్యాఖ్యలపై వైసిపి పార్టీ కీలక నాయకులు తమదైన శైలిలో స్పందిస్తూ ఉన్నారు.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా భువనేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా రియాక్ట్ అయ్యారు.
ఓ ప్రముఖ మీడియా ఛానల్ తో రోజా మాట్లాడుతూ ఎన్టీఆర్ కూతురిగా భువనేశ్వరి అంటే తనకు గౌరవం అని తెలిపారు.

“నన్ను ఏడిపించారు మీ పాపన మీరే పోతారు” అని భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై.స్పందిస్తూ అసెంబ్లీలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో… నన్ను అనరాని మాటలు.టిడిపి పార్టీ నేతల చేత అనిపించి.
చంద్రబాబు ఎంతగానో ఏడిపించారు.దెబ్బకి 23 ఎమ్మెల్యేలకు.
పడిపోయే అధికారం కోల్పోయి.ప్రతిపక్ష నేతగా మిగిలారు.
దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు కరెక్టే.నిజానికి అనవసరంగా ఆడవాళ్లను బాధపెట్టిన… ఏడిపించిన వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు.14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.ఆయన పార్టీ నేతలు అనేక మంది ఆడవాళ్ళని ఏడిపించారు.
అందుకే చంద్రబాబు అధికారం కోల్పోయారు.వైసీపీ పార్టీలో ఎవరూ ఏమీ అనకపోయినా గానీ చంద్రబాబు దొంగ ఏడుపు లకు… భువనేశ్వరి గారు మాట్లాడుతున్నారు అంటే హాస్యాస్పదంగా ఉంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వనజాక్షిని జుట్టు పట్టుకుని కొట్టినప్పుడు.నన్ను ఏడిపించినప్పుడు.
భువనేశ్వరి గారు ఏమైపోయారు అంటూ ఈ సందర్భంలో రోజా ప్రశ్నించారు.ఎన్టీఆర్ గారిని అవమానించి ఆయన ఏడిపించిన వాళ్ళు నిజంగా ఆమె చెప్పినట్లు కొట్టుకుపోతారు అన్నా నిజంగా రోజా తనదైన శైలిలో.
చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.