కుప్పం దెబ్బకి చంద్రబాబు కి పిచ్చెక్కింది అంటున్న వైసీపీ నేత..!!

Roja Satires On Chandrababu In The Name Of Kuppam

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఇటీవల వైసీపీ గెలవడం ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.కుప్పం మున్సిపాలిటీ అంతకుముందు జరిగిన స్థానిక ఎన్నికలలో కూడా అధికార పార్టీ వైసీపీ విజయం సాధించటంతో సొంత నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకోలేని వ్యక్తి రాష్ట్రవ్యాప్తంగా ఏ విధంగా క్యాడర్ నీ ముందుకు తీసుకు వెళ్తాడు అనే విమర్శలు అధికార పార్టీ నాయకులు బాబు పై చేయడం జరిగింది.

 Roja Satires On Chandrababu In The Name Of Kuppam-TeluguStop.com

ఇక ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగడం.మధ్యలో చంద్రబాబు.

అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేయడంతో పాటు మీడియా ముందు చంద్రబాబు ఏడవటం. తెలుగు రాజకీయాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

 Roja Satires On Chandrababu In The Name Of Kuppam-కుప్పం దెబ్బకి చంద్రబాబు కి పిచ్చెక్కింది అంటున్న వైసీపీ నేత..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతమాత్రమే కాకుండా అదే సమయంలో మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగుపెడతానని చంద్రబాబు.చాలెంజ్ కూడా చేశారు.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రాయలసీమలో… వరదలు వల్ల సీమ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తూ.చేస్తున్న వ్యాఖ్యలపై వైసిపి ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా భారీగా కౌంటర్ ఇచ్చారు.కుప్పం దెబ్బకి చంద్రబాబు మతి పోయింది అని అన్నారు.వరద బాధితులను పరామర్శించడానికి అని చెప్పి అక్కడ అసెంబ్లీలో చేయని వ్యాఖ్యలు.ప్రస్తావిస్తూ అందరిచేత చిత్కరాలు పొందారు.

కుప్పం దెబ్బకి చంద్రబాబు కి పిచ్చెక్కింది ఏం మాట్లాడుతున్నారో.? ఏం చేస్తున్నారో.? ఎవరికీ అర్థం కావడం లేదు.ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే చేస్తే ఏమొస్తుంది.? అంటూ చంద్రబాబు చేసిన విమర్శలకు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు.నీకు మాదిరి జగన్ ఏరియల్ సర్వే చేయలేదు.

గాల్లో టీ లు.టిఫిన్ లు తినుకుంటూ.

ఒకపక్క అసెంబ్లీ సమావేశాలు మరో పక్క కలెక్టర్లతో మీటింగులు.వీడియో కాన్ఫరెన్స్ లు.నిర్వహించి వరద బాధితుల విషయంలో సీఎం జగన్ అద్భుతంగా పని చేస్తున్నారని రోజా తెలిపారు.వరదల వల్ల ఎవరికి నష్టం జరిగిందో.? వారికి నష్టపరిహారం ఇస్తున్నే మరోపక్క.సదరు కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇస్తూ.

అధికారులను జగన్ అప్రమత్తం చేస్తున్నారు ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.కానీ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయం లో వరదలు వచ్చిన టైంలో గాల్లో స్నాక్స్ తింటూ పేపరు చదువుతూ.

వ్యవహరించారు ప్రజలంతా గమనిస్తున్నారని అంటూ చంద్రబాబు పై రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.

#AP #Kuppam #RojaChandrababu #AP #AP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube