అనసూయ ఇంటి గుట్టు బయటపెట్టిన రోజా.. అదంతా?

మోస్ట్ గ్లామరస్ బ్యూటీ యాంకర్ అనసూయ గురించి అందరికీ తెలిసింది.తన అందంతో ఎంతోమంది అభిమానులను మనసులను దోచుకుంటుంది.

 Roja, Anchor Anasuya, House Secrets, Jabardasth-roja-anusuya-tollywood-kollywood-TeluguStop.com

సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలు షేర్ చేస్తూంటుంది.అంతేకాకుండా తన మాటలతో అందరిని ఆకట్టుకుంటుంది.

ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తూ తన కెరీర్ ను ఈ షో ద్వారా నే మొదలైందని తెలుపుతూ ఉండేది.అనసూయ బుల్లితెరలో నటించడమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తుంది.

ఇప్పటికీ తన అందాన్ని వయసుతో పెంచుకుంటూ పోతూ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది.ఇదిలా ఉంటే అనసూయ ఇంటి గురించి కొన్ని విషయాలు నటి రోజా బయట పెట్టగా అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది.

ఇటీవలే వచ్చేవారం జబర్దస్త్ షో ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా ఇందులో అనసూయ, రోజా, అదిరే అభి మధ్య కొన్ని విషయాలు బయట పడ్డాయి.ఈ షోలో అదిరే అభి స్కిట్టు లో భాగంగా అనసూయను నీకు అన్ని బుక్కుల్లో కెల్లా ఏ బుక్ ఇష్టమని అడిగాడు.

దీంతో అనసూయ మా ఆయన కనిపించడం లేదగాని ఆయన చెక్ బుక్ అంటే ఇష్టమని తెలిపింది.దీంతో వెంటనే అభి నువ్వు ఇంత సంపాదిస్తున్న గాని ఆయన చెక్కు బుక్కు మీదనే కన్నేసింది అంటూ కామెంట్ చేశాడు.

వెంటనే రోజా అనసూయ చెప్పేది అబద్ధం.ప్రోమో కోసం ఇలా చెబుతుందని, మొత్తం క్యాష్ తన వద్దే ఉంటుందని అనసూయ ఇంటి గుట్టును బయట పెట్టింది రోజా.

అనసూయ చేతిలోనే తన ఇంటి పెత్తనం ఉంటుందని రోజా బయటకు తెలిపింది.కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Anchor Anasuya, Secrets, Jabardasth, Roja-Movie

ప్రస్తుతం చిరంజీవితో పాటు అనసూయ ఆచార్య సినిమాలో, అల్లు అర్జున్ తో పాటు పుష్ప సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది.అంతేకాకుండా తమిళంలో కూడా నటిస్తుందని వార్తలు రాగా విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న సినిమాలో కీలక పాత్రలో నటించనుందని తెలిపారు.మొత్తానికి అనసూయ బుల్లి తెర నుండి టాలీవుడ్ వరకు మంచి గుర్తింపును సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube