విజవాడ వచ్చిన రోజా...మంత్రి పదవి దక్కకపోవడం పై సానుకూలంగా స్పందించారు  

Roja Politely Speaks About The Not Giving The Ministry-

చిన్న తేడా వస్తే తన మాటలతో విరుచుకుపడే వైసీపీ ఎమ్మెల్యే రోజా తనకు మంత్రి పదవి రాకపోవడం పై సానుకూలంగా స్పందించారు.ఇటీవల ఏపీ క్యాబినెట్ కూర్పు జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ కూర్పు లో వైసీపీ ఎమ్మెల్యే రోజా కు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుంది అని అందరూ భావించారు...

Roja Politely Speaks About The Not Giving The Ministry--Roja Politely Speaks About The Not Giving Ministry-

కానీ ఎమ్మెల్యే రోజా కు ఎలాంటి పదవి దక్కలేదు.అయితే ఈ అంశం పై కొన్ని మీడియా లు మంత్రి పదవి దక్కలేదని రోజా అలిగారని,అందుకే మంత్రుల ప్రమాణస్వీకారానికి కూడా ఆమె హాజరు కాలేదంటూ వార్తలు వెల్లడయ్యాయి.అయితే తాజాగా ఆమె విజయవాడ కు వచ్చారు.

ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ తనకు మంత్రి పదవి దక్కకపోవడం పై మాట్లాడారు.కుల సమీకరణాల కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని అనుకుంటున్నానని ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు.కేబినెట్‌ కూర్పు అనంతరం తొలిసారిగా ఈ రోజు ఆమె విజయవాడ వచ్చారు.

Roja Politely Speaks About The Not Giving The Ministry--Roja Politely Speaks About The Not Giving Ministry-

రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల కోసం విజవాడ వచ్చానని తెలిపిన ఆమె నాకు ఎలాంటి బాధలేదని ఇదంతా కూడా మీడియా సృష్టే అని ఆమె స్పష్టం చేశారు.అలానే తనకు నామినేటెడ్ పదవి ఇస్తానని ఎవరూ చెప్పలేదని ఇది కూడా మీడియా సృష్టే అని ఆమె అన్నారు.అయితే మంత్రుల ప్రమాణస్వీకారానికి ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించగా, ప్రమాణ స్వీకారానికి మంత్రులు కావలి కానీ,ఎమ్మెల్యేలు ఎందుకు అందుకే నేను ఆ కార్యక్రమానికి రాలేదు అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.