Roja Arundhati Movie : అలాంటి సినిమాలో నటించాలని ఆశ పడుతున్న రోజా .. తీరడం కష్టమేనా?

ప్రముఖ సినీ నటి రోజా ప్రస్తుతం రాజకీయాలకే పరిమితమైనా సినీ అభిమానులలో ఆమెకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనే సంగతి తెలిసిందే.రాబోయే రోజుల్లో రోజా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Roja Plans About Movies Selection Details Here Goes Viral In Social Media , Roj-TeluguStop.com

రోజా తన సినీ కెరీర్ లో దాదాపుగా అన్ని షేడ్స్ ఉన్న పాత్రలలో నటించారు.అయితే అరుంధతి తరహా సినిమాలో నటించాలని రోజా ఆశ పడుతున్నారు.

అనుష్క సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో అరుంధతి సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.అనుష్కకు ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టగా కోడి రామకృష్ణకు దర్శకునిగా ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది.

ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడితో పోలిస్తే రెట్టింపు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.అయితే ప్రస్తుతం రోజా వయస్సు 50 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.ఈ వయస్సులో రోజాకు ఈ తరహా పాత్రలు సూట్ అవుతాయని చెప్పలేము.

అయితే రోజా ఆశ పడుతున్న నేపథ్యంలో దర్శకనిర్మాతలలో ఎవరైనా ఈ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది.

రోజా జబర్దస్త్ షోకు కూడా గుడ్ బై చెప్పడం ఆమె ఫ్యాన్స్ ను ఒకింత హర్ట్ చేసింది.రోజా జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని మరి కొందరు ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

రోజా మంత్రిగా కొనసాగిస్తున్నా సినీ రంగంలో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించాలని ఆమె అనుకుంటున్నారు.

Telugu Anushka, Arundhati, Jabardasth Show, Roja-Movie

రోజా ఏ రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ అవుతూ అభిమానులను ఆమె ఆకట్టుకుంటున్నారు.వైసీపీ తరపున రెండుసార్లు పోటీ చేసి విజయం సాధించిన రోజా 2024 ఎన్నికల్లో కూడా మళ్లీ గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు.ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తుండటం రోజాకు ప్లస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube