రేవంత్ రెడ్డి పై సీరియస్ కామెంట్లు చేసిన రోజా..!!

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఆయన కుమారుడు నారా లోకేష్ పై మండిపడ్డారు.ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.

 Roja Made Serious Comments On Rewanth Reddy Roja , Rewanth Reddy,latest News-TeluguStop.com

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై స్పందిస్తూ.చంద్రబాబు అదే రీతిలో నారా లోకేష్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో రైతాంగానికి మేలు చేయడం కోసం సీఎం జగన్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులకు మేలు చేసే ప్రభుత్వం కాబట్టి వివిధ పథకాల ద్వారా ఇప్పటికీ జగన్ ప్రభుత్వం దాదాపు రైతులకు 83 వేల కోట్ల రూపాయలను అందజేయడం జరిగిందని తెలిపారు.

Telugu Ap Tg, Ap, Chandrababu, Lokesh, Rewanth Reddy, Roja-Latest News - Telugu

రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటే నారా లోకేష్ అదే రీతిలో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఇక ఇదే రీతిలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం విషయంలో కేంద్రం తలదూర్చి పరిష్కరించాలని స్పష్టం చేశారు.అదే రీతిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ పదవి అందుకున్న రేవంత్ రెడ్డి.

తెలుగుదేశం పార్టీ కోవర్ట్ గా కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు అంటూ ఆరోపణలు చేశారు.ఇక ఇదే రీతిలో అప్పట్లో కేసీఆర్ దైవదర్శనం కోసం తమిళనాడు వెళ్తూ తన ఇంటికి వచ్చారని ఆ సమయంలో విందు ఇవ్వడం జరిగిందని, అంతకంటే ముందే అప్పట్లో కే‌సి‌ఆర్ కు  చంద్రబాబు ఇరవై ఎనిమిది రకాల వంటకాలు తో.విందు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ విషయం రేవంత్ రెడ్డి కి గుర్తులేదా అంటూ.రోజా నిలదీశారు.10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో.ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అక్కడ ఉండకుండా పారిపోయి వచ్చారు అని, చంద్రబాబు పారిపోవడానికిగల కారణం ఏంటి అంటూ రోజా ఈ సందర్భంగా ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube