లోకేష్‌ను దద్దమ్మ, దద్దోజనం అన్న రోజా

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దు విషయమై నేడు అసెంబ్లీలో చర్చ కార్యక్రమం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది.

 Roja Lokesh Dadhamma Daddojanam-TeluguStop.com

మండలి అంటే పెద్ద వారు, అనుభవజ్ఞులు ఉంటారు.మండలికి పెద్దల సభ అనే పేరు ఉంది.

కాని చంద్రబాబు నాయుడు తన రాజకీయ వారసుడి భవితవ్యం కోసం పెద్దల సభకు దద్దమ్మ దద్దోజనం అయిన లోకేష్‌ను పంపించాడు అంటూ రోజా సెన్షేషనల్‌ కామెంట్స్‌ చేసింది.

నేడు మండలి రద్దు విషయమై చర్చ జరుగుతున్న సమయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు పారిపోయాడు.

ఇక్కడ నిలబడి సమాధానం చెప్పే ధైర్యం లేకుండా పోయిందా.బయట ఎక్కడో మీడియా సమావేశాలు పెట్టి నోరు పారేసుకునే బదులు అసెంబ్లీలో రద్దు విషయమై చర్చిస్తే బాగుంటుంది కదా అంటూ రోజా అన్నారు.

చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌లు రాజకీయాలు మానేసి అభివృద్దికి సహకరించాలంటూ ఈ సందర్బంగా రోజా హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube