ఆ పదవి కోసం పూజలు చేస్తున్న రోజా.. దేవుడు కరుణిస్తాడా..?  

roja kartheeka masam puja photos goes viral in social media, ap flim shooting commity chairman, apiic chairman, mla roja, ycp mla - Telugu Ap Film Shooting Commitee Chairman, Apiic Chairman, Mla Roja, Ycp Mla

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రోజా వైసీపీ తరపున నగరి నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్న సంగతి తెలిసిందే.రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజాకు కేబినేట్ లో చోటు దక్కుతుందని ప్రజలు, వైసీపీ నేతలు భావించినా కుల సమీకరణల వల్ల రోజాకు చోటు దక్కలేదు.

TeluguStop.com - Roja Kartheeka Masam Puja Photos Goes Viral In Social Media

అయితే జగన్ రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి దక్కింది.

వచ్చే ఏడాది జరగబోయే కేబినేట్ మార్పుల్లో రోజాకు తప్పనిసరిగా చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

TeluguStop.com - ఆ పదవి కోసం పూజలు చేస్తున్న రోజా.. దేవుడు కరుణిస్తాడా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే రోజా సినిమా రంగానికి చెందిన వ్యక్తి కావడంతో సీఎం జగన్ ఆమెకు ఫిల్మ్ షూటింగ్స్ కు సంబంధించిన మరో పదవిని కూడా ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని.ఈ పదవి కోసం పోటీ తీవ్రంగానే ఉన్నా రోజాకే పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ప్రస్తుతం రోజా కార్తీకమాసం పూజలు చేస్తుండగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Ap Film Shooting Commitee Chairman, Apiic Chairman, Mla Roja, Ycp Mla-Political

ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు రోజా ఫిల్మ్ షూటింగ్స్ కమిటీ ఛైర్మన్ పదవి కోసమే పూజలు చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. కార్తీకమాసం సందర్భంగా రోజా ప్రతేక పూజలు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.రాష్ట్రంలో సినిమా షూటింగుల అనుమతులకు సంబంధించిన పదవి రోజాకు దక్కనుందని తెలుస్తోంది.

కరోనా వల్ల కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఫిల్మ్ షూటింగ్స్ కమిటీకి రోజా ఛైర్మన్ గా నియమించనున్నారు.

మరోవైపు రోజా నగరి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తున్నారు.

నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంచి పేరు సంపాదించుకుంటున్నారు.వచ్చే ఏడాది ఇదే సమయానికి రోజాకు మంత్రి పదవి కూడా దక్కే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

#YCP MLA #MLA Roja #ApFilm #APIIC Chairman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Roja Kartheeka Masam Puja Photos Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..