రోజా మంత్రి ఆశలకు అడ్డంగా మారిన ' రెడ్డి ' ?

తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్టుగా తయారయ్యింది ఎమ్మెల్యే రోజా పరిస్థితి.వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టిడిపిపై గట్టి గొంతు వినిపించే వారు రోజ.

 Roja Has No Chance Of Becoming A Minister Due To Minister Peddireddy Ramachandra-TeluguStop.com

వైసిపి పైన జగన్ పైన ఎవరు విమర్శలు చేసినా తన నోటికి రోజా పని చెబుతూ ఉండేవారు.  అసెంబ్లీలోనూ ఆమె వాగ్ధాటికి అధికార పార్టీ గా ఉన్న టిడిపి కూడాా బెదిరిపోయేది.

అందుకే ఆమె అసెంబ్లీలో అడుగు పెట్టకుండా సస్పెన్షన్ వేటు వేసింది .రోజా ప్రభావం అంతగా ఉండేది.అందుకేే ఆమె వైసిపి లో జగన్ మనిషిగా  ముద్ర వేయించుకుని,  జగన్ దగ్గర ప్రత్యేక గుర్తింపును పొందారు.ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గంలోకి ఆమెను తీసుకుని కీలకమైన పదవిని కట్టబెడతారు అని, ఆమెతో పాటు పార్టీ నాయకులు అభిప్రాయపడినా జగన్ మాత్రం ఆమెకు మొండిచేయి చూపించారుు.

దీంతో ఆమె అలక చెందినట్లుగా వ్యవహరించడంతో, ఆమెను బుజ్జగించేందుకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టారు.పరిశ్రమల పరంగా మంచి ప్రాధాన్యం ఉన్న పదవి కావడంతో రోజా కూడా సంతృప్తి చెంది రెండో విడతలో జరిగే మంత్రివర్గ విస్తరణలో తనకు జగన్ తప్పకుండా అవకాశం కల్పిస్తారని ఆశలు పెట్టుకున్నారు.

 ప్రస్తుతం రోజా నిర్వహిస్తున్న ఏపీఐఐసీ చైర్మన్ పదవిని తాజాగా మెట్టు గోవిందరెడ్డి అనే పార్టీ నాయకుడికి జగన్ కేటాయించారు.దీంతో రోజా కు మంత్రి పదవి ఖాయమయిందని అందుకే నామినేటెడ్ పదవి నుంచి తప్పించారు అనే వార్తలు ఒకవైపు వస్తున్నా, రోజా మంత్రి పదవి ఆశలకు  మరో గండం ఏర్పడింది.

ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రోజాకు ఆ సామాజిక వర్గమే ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది.అది కాకుండా చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వైసిపి లో కీలక నాయకుడు గా,  జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు.

జిల్లా రాజకీయాలతో పాటుు, రాష్ట్ర వ్యాప్తంగా ను ఆయన ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆయన ను కాదని జగన్ అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రోజా కు మంత్రి పదవి ఇచ్చే అవకాశమే లేదని సంకేతాలుు రోజా వర్గీయులను కలవరానికి గురిచేస్తోంది.
 

Telugu Ap Cm Jagan, Apiic Chairman, Nagari Mla, Rk Roja, Ysrcp-Telugu Political

ఒకే జిల్లా నుంచి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నేతలకు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని ప్రచారం జరుగుతోంది.అయితే గత కొంత కాలంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం పార్టీలోను ప్రభుత్వంలోను ఎక్కువైందనే ప్రచారంతో జగన్ అప్రమత్తమయ్యారు అని, అందుకే పెద్ది రెడ్డితో పాటు , బొత్స సత్యనారాయణ వంటివారిని రాజ్యసభకు పంపించే అవకాశం ఉన్నట్లు వస్తున్న వార్తలతోో రోజా   కాస్త ఉపశమనం పొందుతున్నారు.అయితే జగన్ సామాజిక వర్గం సమతూకం పాటిస్తున్న క్రమంలో రోజా కు  ఛాన్స్ అంతంతమాత్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube