పరాయి మగాళ్లతో పిల్లల్ని కనమని మీ తల్లిదండ్రులు నేర్పించారా… అంటూ రోజా…  

Roja, telugu veteran heroine, bathuku jataka bandi program, Tollywood, Zee telugu - Telugu Bathuku Jataka Bandi Program, Roja, Telugu Veteran Heroine, Tollywood, Zee Telugu

బయట ప్రపంచంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలను తీసుకుని వాటిని గురించి ప్రజలకు తెలియజేయడమేగాక బాధితులకు న్యాయం చేసే విధంగా నిర్వహిస్తున్న“బతుకు జట్కా బండి” అనే షో కి మంచి రెస్పాన్స్ వస్తోంది.అయితే తాజాగా ఈ షోకి కట్టుకున్న భార్య ఉండగానే ఆమెకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా మరో యువతిని పెళ్లి చేసుకుని భార్యని వదిలి పెట్టినటువంటి ఓ వ్యక్తిని షోకి పిలిపించి షో జడ్జి సీనియర్ నటి  మరియు ప్రస్తుత ఎమ్మెల్యే రోజా కడిగి పారేసింది.

 Roja Fires On Bathuku Jataka Bandi Program

వివరాల్లోకి వెళితే ఓ పెళ్లయిన మహిళ తనని 14 ఏళ్లకే తన భర్త పెళ్లి చేసుకున్నాడని కానీ పెళ్లయినప్పటి నుంచి కట్నకానుకలు మరియు ఇతర విషయాల గురించి వేధిస్తున్నాడని కావున తనకు తగిన న్యాయం చేయాలంటూ బతుకు జట్కా బండి షో నిర్వాహకులను సంప్రదించింది.దీంతో ఈ షో జడ్జి రోజా మహిళ భర్తను పిలిపించింది.

అలాగే అతడితో పాటు అనధికారికంగా అతడు పెళ్లి చేసుకున్నటువంటి యువతిని కూడా పిలిపించింది.ఈ క్రమంలో పరాయి వ్యక్తులతో పిల్లల్ని కనమని మీ తల్లిదండ్రులు నీకు నేర్పించారా.? అంటూ ఫైర్ అయ్యింది.అంతేకాక ఇక్కడ  అలాంటి వాళ్ళకి న్యాయం చేయమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పరాయి మగాళ్లతో పిల్లల్ని కనమని మీ తల్లిదండ్రులు నేర్పించారా… అంటూ రోజా…-Latest News-Telugu Tollywood Photo Image

మామూలుగానే సమస్యలపై ఫైర్ అయ్యే రోజా అలా మాట్లాడేసరికి యువతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

మరి న్యాయం కోసం వచ్చినటువంటి ఆ మహిళకి ఎలాంటి న్యాయం జరిగిందో తెలియాలంటే వచ్చే సోమవారం వరకూ ఆగాల్సిందే.ఈ షో జీ తెలుగు ఛానెల్ లో సోమవారం నుంచి శనివారం వరకూ ప్రతీ  రోజూ  ఉదయం 11.30 ని.ప్రసారమవుతుంది.డోంట్ మిస్.

#Roja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Roja Fires On Bathuku Jataka Bandi Program Related Telugu News,Photos/Pics,Images..