కోహ్లీ అవుట్.. రోహిత్ ఇన్..!

తాజాగా విరాట్ కోహ్లీకి బీసీసీఐ పితృత్వ సెలవులకు ఆమోదం పలికింది.ప్రస్తుతం విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ నిండు గర్భవతి అన్న విషయం అందరికీ తెలిసిందే.

 Kohli Out .. Rohit In,  Kohili, Rohit Sharma, Bcci, Australia, Bangalore, Anushk-TeluguStop.com

ఈవిడ జనవరి మాసం ఆరంభంలో బిడ్డకు జన్మను ఇవ్వబోతోంది.ఈ సందర్భంగా విరాట్ కోహ్లీకి బిసిసిఐ సెలవును మంజూరు చేసింది.

అయితే ఐపీఎల్ తర్వాత భారత జట్టుతో కలిసి డైరెక్టుగా ఆస్ట్రేలియాకు కోహ్లీ వెళ్లనున్నాడు.అక్కడ ఆస్ట్రేలియాతో మొత్తం నాలుగు టెస్టుల్లో ఆడనుండగా అందులో మొదటి టెస్ట్ అడిలైడ్ లో జరగనుంది.

అయితే ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆడుతుండగా ఆ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ టీమిండియా కు తిరిగి రానున్నాడు.దీంతో మిగతా మూడు టెస్టులకు అతను అందుబాటులో ఆస్ట్రేలియాలో ఉండడు.

తాజాగా ఐపీఎల్ లో తొడ కండరాల గాయం కారణంగా టీమిండియాను ఎంపిక కాలేకపోయిన రోహిత్ శర్మ కు తాజాగా బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది.ముందుగా తొడ కండరాల కారణంగా బీసీసీఐ రోహిత్ శర్మను సెలక్టర్లు పక్కన పెట్టగా.

ఆ తర్వాత అతను పూర్తి ఫిట్నెస్ తో ఐపీఎల్ మ్యాచ్ ఆడటంతో ఆ అంశం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.దింతో ఈ అంశంపై తాజాగా సెలెక్టర్లు రోహిత్ శర్మ ను సంప్రదించిన తర్వాతే టీ – 20, వన్డే సిరీస్ లకు విశ్రాంతి ఇచ్చిన సెలెక్టర్లు ఆ తర్వాత టెస్ట్ కు ఎంపిక చేశారు.

అయితే ఐపీఎల్ అనంతరం రోహిత్ శర్మ భారతదేశానికి చేరుకొని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్ సాధించిన తర్వాత నవంబర్ చివరి వారంలో రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు వెల్లబోతున్నాడు.అయితే ఈ సిరీస్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.

దీనికి కారణం అతనికి భుజం గాయం కారణంగా టి20 సిరీస్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన అతను గాయాన్ని దాచిపెట్టి ఐపీఎల్ లో ఆడడంతో వరుణ్ కు మరింత నష్టం చేకూరింది.

దీంతో ఆయనకు ఖచ్చితంగా శస్త్రచికిత్స చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో తన యార్కర్ బాల్స్ తో అందరినీ ఆకట్టుకున్న పేసర్ నటరాజన్ వరుణ్ స్థానంలో జట్టులోకి ఆహ్వానం పలికింది బీసీసీఐ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube