“బాపట్ల” కుర్రాడు...“అమెరికాలో రికార్డు” సృష్టించాడు..

“ఇందుగలడు అందు గలడనే సందేహం లేదు ఎందెందు వెతికినా సరే అందందు కలడు భారతీయుడు.” దేవుడికి సంభందించిన ఈ పద్యం ఇప్పుడు విదేశాలలో ఉన్న ఎంతో మంది భారతీయులకి కూడా వర్తిస్తోంది.

 Rohit Vulchi Awarded With Ag Scholar Award-TeluguStop.com

భారతీయుడు ఎక్కడ ఉన్నా సరే భారత దేశ గడ్డ యొక్క సత్తా ని చూపించడంలో మనకి సాటి మనమేనన్న సూత్రాన్ని మాత్రం తప్పకుండా పాటిస్తాడు.దేశ విదేశాలలో విదేశీ ఎప్పటికప్పుడు భారత జెండాని రెపరెపలాడిస్తూ ఉంటాడు.

వివరాలలోకి వెళ్తే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, బాపట్లకు చెందిన రోహిత్‌ వుల్చి ఏజీ స్కాలర్‌ అవార్డుకు ఎంపికయ్యారు…విన్సెంట్‌ ఈ పెట్రుస్సీ విటి కల్చర్‌ బిల్డింగ్‌లో కాలిఫోర్నియా 23వ డిస్ట్రిక్ట్‌ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జిమ్‌ పాట్టర్‌సన్‌ చేతుల మీదుగా రోహిత్‌ ఏజీ స్కాలర్‌ అవార్డును అందుకున్నారు.రోహిత్ బాపట్లలో అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో చదువుకున్న తరువాత ఉన్నతమైన చదువుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో అగ్రికల్చరల్‌ విభాగంలో మాస్టర్స్‌ చేస్తున్నారు.

అయితే చిన్నప్పటి నుంచీ మొక్కల మీద ఉన్న ప్రేమ.

తండ్రి కొత్త గూడెం జిల్లా అశ్వరావు పేటలో అగ్రికల్చరల్‌ విభాగానికి చెందిన ఓ ప్రైవేట్‌ కంపెనీలో చేయడం.దాంతో చిన్నతనం ఆ వాతావరణంలో పెరగడంతో మొక్కలపై రోహిత్ కి మక్కువ పెరిగిందని అదే ఇప్పుడు వాటిపై పరిశోధనల వరకూ తీసుకు వెళ్లిందని అన్నాడు రోహిత్ అయితే ప్రస్తుతానికి రోహిత్ ఆల్మండ్‌, పిస్తాపప్పు మొక్కలకు హాని కలిగించే లెపిడోపెటెరాన్‌ కీటకాల ను తక్కువ ఖర్చుతో ఎలా నివారించవచ్చు అనే విషయంపై పరిశోధనలు చేస్తున్నాడు.

అంతేకాదు రోహిత్ యూసీ కెర్నీ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌లోని ఎంటమాలజీ లాబొరేటరీలో రీసెర్చ్‌ టెక్నీషియన్‌గా కూడా రోహిత్‌ పని చేస్తున్నారు…రోహిత్‌ సాధించిన ఈ ఘనత మాకు ఎంతో సంతోషంగా ఉందని తనకి పట్టుదల ఎక్కువ అని తల్లిదండ్రులు కృష్ణ మోహన్, లక్ష్మి.సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube