రోహిత్ చేసిన ఈ పనికి ఫ్యాన్స్ ఫిదా... అదేంటంటే?

భారతదేశంలో దేశంలో అత్యంత అదరణీయమైన క్రీడలలో క్రికెట్ ఒకటి.వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్కుల వారు క్రికెట్ ను ఆస్వాదిస్తారు.

 Rohit Sharma Wrote Save The Corals On His Shoes Fans Appreciate His Work , Crick-TeluguStop.com

క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా పూజించే కొండత అభిమానం భారత క్రికెట్ కు సొంతం.ఇక టీ20, వన్డేలు జరుగుతున్నప్పుడు అభిమానులు చేసే సందడి మామూలుగా ఉండదు.

అయితే ఇది ఒక ప్రక్కకు ఉంచితే ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది.ఐపీఎల్ అంటే భారత క్రికెట్ అభిమానులకు పండగే అని మనం ప్రత్యేకంగా చెప్పుకొనక్కరలేదు.

ఎందుకంటే ఆట, పాట,ఆ మస్తీ అన్ని కలగలిస్తేనే ఐపీఎల్.ఇటు గ్రౌండ్ లో విధ్వంసకర ఆటతీరుతో చెలరేగుతూనే మ్యాచ్ లేని సమయాల్లో రకరకాల కార్యక్రమాల ద్వారా అభిమానులను అలరిస్తున్నారు.

ఐపీఎల్ అనేది కొన్ని కోట్ల మంది వీక్షించే అతి పెద్ద క్రికెట్ టోర్నీ.ఇక్కడ ఏది చేసినా సరే కోట్లాది మందికి చేరుతుంది.

అందుకే క్రికెటర్ రోహిత్ శర్మ తన షూస్ మీద రకరకాల మంచి మంచి విషయాలను రాసి అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు.తన షూపై సేవ్ ది కోరల్స్ అని రాసుకొచ్చాడు.

సముద్రం అనేది మనకు ఉన్న గొప్ప సంపద అని, సముద్రం మీద ఆధారపడి కొన్ని కోట్ల జీవరాశులు జీవనం సాగిస్తాయని, వాటిని కాపాడుకునే బాధ్యత మనకుందని తన ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు.రోహిత్ చేస్తున్న ఈ పని అభిమానులను ఫిదా చేసిందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube