ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన రోహిత్‌ శర్మ..!

తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 1000 పరుగులు సాధించి రికార్డు సృష్టించారు.ఐపీఎల్ 2021 సీజన్ లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును నెలకొల్పారు.

 Rohit Sharma Sets Rare Record In Ipl-TeluguStop.com

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ఒకే జట్టుపై 1000+ పరుగులు సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచారు.ఈ ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ రెండో బంతిని ఫోర్‌ కొట్టడంతో రోహిత్‌ కేకేఆర్‌పై ఈ రికార్డ్ క్రియేట్ చేయగలిగారు.

ఇక రోహిత్‌ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ నిలిచారు.డేవిడ్ వార్నర్ పంజాబ్ కింగ్స్‌పై 943 పరుగులు చేశారు.అలాగే, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై 915 పరుగులు చేసి.ఐపీఎల్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచారు.

 Rohit Sharma Sets Rare Record In Ipl-ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన రోహిత్‌ శర్మ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సైతం ఈ లిస్టులో అగ్రస్థానంలో నిలిచారు.ఈ ఆటగాడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 909 పరుగులు.

చెన్నై సూపర్ కింగ్స్‌పై 895 పరుగులు చేశారు.

Telugu Ipl, Latest News, New Record, Rohit Sharma, Sports Updates-Latest News - Telugu

అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.ఈ మ్యాచ్ లో ముంబై 156 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ముందుంచింది.అయితే కేకేఆర్ బ్యాట్స్‌మెన్ కేవలం 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి తన విజయం సాధించారు.రోహిత్ శర్మ సునీల్ నరైన్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు.

ఈ మ్యాచ్ లో ఇతను 33 పరుగులు చేశారు.మిగిలిన ఆటగాళ్లు చాలా పేలవమైన ప్రదర్శన కనబర్చి తక్కువ పరుగులకే జట్టును పరిమితం చేశారు.

దాంతో ర్యాంకింగ్ స్థానంలో ముంబై ఇండియన్స్ 6వ స్థానానికి పడిపోయింది.అయితే ఓడిపోయిన తరువాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.

తదుపరి మ్యాచ్లలో కచ్చితంగా గెలవడానికి ప్రయత్నిస్తామని అన్నారు.

#Rohit Sharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు