రాజీవ్ ఖేల్ ‌రత్న పురస్కారానికి ఎంపికైన హిట్ మ్యాన్...!

టీమిండియా పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ క్రీడారంగంలో అత్యున్నత స్థాయికి ఇచ్చే పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న కు ఎంపికయ్యాడు.ఈ విషయాన్ని నేడు సెలెక్షన్ ప్యానెల్ సమావేశంలో ఖరారు చేయడం జరిగింది.

 Cricketer Rohit Sharma Nominated For The Rajiv Gandhi Khel Ratna Award , Rajiv K-TeluguStop.com

రోహిత్ శర్మ తోపాటు ఏసియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ వినేష్ పొగట్, అలాగే పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మ‌నికా బాత్రా కూడా ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు.

ఈ నలుగురి పేర్లను నేడు సెలెక్షన్ ప్యానెల్ కమిటీ సమావేశమై క్రీడాకారుల పేర్లను ప్రకటించింది.

ఇకపోతే రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని గత నాలుగు సంవత్సరాలలో భారతదేశం తరఫునుండి క్రీడల్లో అంతర్జాతీయస్థాయిలో మెరుగు ప్రదర్శన ఎవరు చూపిస్తారో వారికి ఈ అవార్డును అందజేస్తారు.ఇప్పటివరకు రోహిత్ శర్మ కంటే ముందుగా క్రికెట్ లో కేవలం ముగ్గురు మాత్రమే ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

క్రికెట్ తరఫున రోహిత్ శర్మ నాలుగో వ్యక్తిగా ఎన్నికయ్యాడు.ఇదివరకు 1998లో సచిన్ కు మొట్టమొదటి ఖేల్ రత్న పురస్కారం అందజేయగా ఆ తర్వాత 2007లో ధోని, ఆపై 2018లో విరాట్ కోహ్లీకి ఈ పురస్కారం లభించింది.

ఇక రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గత సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ లో ఏకంగా ఐదు సెంచరీలు చేసి, ఒక వరల్డ్ కప్ లో 9 మ్యాచులు ఆడి ఏకంగా 648 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు.

అంతేకాకుండా పరిమిత ఓవర్ క్రికెట్ మ్యాచ్ లో అనేక రికార్డులను రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు.గత నాలుగు సంవత్సరాల్లో రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన తో ముందుకు వెళుతున్నాడు.

ఇకపోతే ఇప్పటివరకు రోహిత్ శర్మ టీమిండియా తరపున 32 టెస్టులు, 224 వన్డేలు, 108 టి-20లలో పాలుపంచుకున్నాడు.ఇక 50 ఓవర్ల పరిమిత మ్యాచ్లలో ఎవరికీ లేని విధంగా మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక వ్యక్తిగా రోహిత్ శర్మ రికార్డుకెక్కాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube