Rohini : బ్లాక్ సారీలో రోహిణి రచ్చ.. ఇటువంటి పద్ధతి మాకు నచ్చదంటూ నెటిజన్స్ కామెంట్స్?

అప్పుడప్పుడు సెలబ్రెటీల తీరు నెటిజన్స్ కు అస్సలు నచ్చదు.మామూలుగా ఫ్యాన్స్ తమ అభిమాన సెలబ్రెటీలపై బాగా అభిమానం చూపిస్తూ ఉంటారు.

 Rohini Racha In Black Saree Netizens Comments That We Dont Like This Kind Of Me-TeluguStop.com

వాళ్లతో కమ్యూనికేషన్ పెంచుకోవాలని అనుకుంటారు.కానీ సెలబ్రెటీలు( Celebrities ) మాత్రం ఫ్యాన్స్ తో అలా మూవ్ అవ్వరు.

ఇక ఈమధ్య సోషల్ మీడియా కూడా అందుబాటులో ఉండటంతో ఈజీ కమ్యూనికేషన్ బాగా ఉంటుంది.ఇక ఈ వేదికల ద్వారా చాలామంది తమ అభిమాన సెలబ్రెటీలతో కమ్యూనికేషన్ పెంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు.

అందుకే వాళ్ళు ఏ పోస్ట్ షేర్ చేసిన కూడా వెంట వెంటనే కామెంట్లు చేస్తూ ఉంటారు.వాళ్ళ పోస్టుకు పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటారు.

కానీ వాళ్ళు మాత్రం అస్సలు పట్టించుకోరు.ఎవరికైతే స్పందించాలో వాళ్ళకే స్పందించి అభిమానులను నిరాశ పరుస్తూ ఉంటారు.

అయితే తాజాగా రోహిణి పట్ల కూడా ఇలాగే నిరాశ చెందుతున్నారు కొందరు అభిమానులు.

టాలీవుడ్ బుల్లితెరపై సీరియల్ నటిగా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది రోహిణి( Rohini ).ఇక తను సీరియల్ లో నటిస్తున్న సమయంలోనే తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం సొంతం చేసుకుంది.ఇప్పటికీ బుల్లితెరపై కొంచెం ఇష్టం కొంచెం కష్టం, శ్రీనివాస కళ్యాణం, ఇన్స్పెక్టర్ కిరణ్ వంటి పలు సీరియల్స్ లో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక స్టార్ మా లో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని తెలుగు ప్రేక్షకులతో మరింత పరిచయం పెంచుకుంది.ఇక అందులో ఉన్నంతకాలం తన ఆటపాట తీరుతో అందర్నీ ఫిదా చేసింది.

కానీ నాలుగో వారానికే ఇంటి బాట పట్టేసింది.ఇక బిగ్ బాస్ తర్వాత ఆమె జబర్దస్త్( Jabardast ) లో గెస్ట్ గా లేడీ కమెడియన్ గా సెటిల్ అయింది.

అందులో తన కామెడీతో, పంచ్ డైలాగులతో మరింత నవ్వించింది.దీంతో ఈమెకు జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షోలలో కూడా అవకాశాలు వచ్చాయి.ఏదైనా ఈవెంట్లో పాల్గొంటే చాలు బాగా సందడి చేస్తూ ఉంటుంది.ఇక ప్రస్తుతం ఆమె బుల్లితెరపై బాగా దూసుకుపోతుందని చెప్పాలి.ఇక ఎంత బిజీ సమయంలో ఉన్నా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి అభిమానం ఉంది.

ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు అవి క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.ఇక ఇదంతా పక్కనే పెడితే తాజాగా తను దసరా మూవీలోని వదినే పాటకు డాన్స్ చేయగా ఆ డాన్స్ వీడియోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

అందులో బ్లాక్ సారీ కట్టుకొని తన స్టెప్పులతో బాగా రచ్చ రచ్చ చేసింది.

అయితే ఆ వీడియో చూసి తన అభిమానులు బాగా లైక్స్ తో ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే ఓ నెటిజన్ మాత్రం ఆమె ప్రవర్తన పై కాస్త ఫైర్ అయినట్లు తెలుస్తుంది.రోహిణి వదిన పాటకు డాన్స్ చేస్తున్నట్లు హాష్ ట్యాగ్ తో వదినే క్యాప్షన్ ఇచ్చింది.

వెంటనే దానికి మరో సెలబ్రిటీ దీప్తి సునైనా బాగుంది అన్నట్లుగా ఎమోజితో స్పందించింది.దానికి రోహిణి కూడా మళ్లీ రిప్లై ఇచ్చింది.

ఇక వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ చూసి.అంటే మీరు మీరు రిప్లై ఇచ్చుకుంటారు అన్నమాట.

ఇటువంటి పద్ధతి మాకు అసలు నచ్చదు అంటూ కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ డాన్స్ వీడియో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube