రవితేజకి విలన్ గా మారుతున్న పూరి జగన్నాథ్ హీరో  

రవితేజకి విలన్ గా మారిన రోగ్ హీరో. .

Rogue Hero Turned As A Vilan To Raviteja-raviteja,rogue Hero Turned As A Vilan,telugu Cinema,tollywood

రోగ్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుర్ర హీరో ఇషాన్. కర్నాటకలో బడా ప్రొడ్యూసర్ సిఆర్ మనోహర్ తమ్ముడుగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరోని పూరీ జగన్నాథ్ హీరోగా పరిచయం చేసాడు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో ఈ కుర్ర హీరోని టాలీవుడ్ లో ఎవరు పట్టించుకోలేదు..

రవితేజకి విలన్ గా మారుతున్న పూరి జగన్నాథ్ హీరో-Rogue Hero Turned As A Vilan To Raviteja

ఇక కన్నడ ఇండస్ట్రీలో కూడా ఈ హీరోకి అవకాశాలు రాలేదు. అయితే చాలా గ్యాప్ తర్వాత మరల ఈ హీరో తెరపై కనిపించబోతున్నాడు. అయితే ఈ సారి అతను విలన్ గా దర్శనం ఇస్తాడని తెలుస్తుంది.

రవితేజ హీరోగా ఆర్ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడుగా పరిచయం అయిన అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం అనే సినిమా ఒకే అయ్యింది. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా రోగ్ హీరో ఇషాన్ విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆది పినిశెట్టి హీరో నుంచి విలన్ గా మారి మెప్పించాడు.

ఇక తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా తెలుగులో విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ నేపధ్యంలో విలన్ టర్న్ హీరో ఏ మేరకు తన విలనిజంతో మెప్పిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.