లాడెన్ దొరికేశాడోచ్ : సంబరాలు చేసుకుంటున్నజనం  

Rogue Bin Laden Elephant Caught In Assam-

ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీసిన లాడెన్ ఎట్టకేలకు చిక్కడంతో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.అదేంటి లాడెన్ ఎప్పుడు చచ్చిపోయాడు కదా ? ఇప్పుడు సంబరాలు చేసుకోవడం ఏమిటి అనే కదా మీ డౌట్ ! అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే !అసోంలోని గోల్పారా జిల్లాలో చాలా కాలంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎంతోమంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఏనుగుని ఎట్టకేలకు అధికారులు చాకచక్యంగా, ఎటువంటి నష్టం జరగకుండా బంధించగలిగారు.ఆ ఏనుగు ప్రజల ప్రాణాలు తీస్తుండడంతో దానికి లాడెన్ అనే పేరు పెట్టారు స్థానికులు.ఈ లాడెన్ బారినపడి అక్టోబర్ నెలలోనే ఐదుగురు గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారట.ఇక ఈ ఏనుగును పట్టుకోవడానికి అధికారులు చాలా ఏర్పాట్లే చేసుకున్నారు.

Rogue Bin Laden Elephant Caught In Assam- Telugu Viral News Rogue Bin Laden Elephant Caught In Assam--Rogue Bin Laden Elephant Caught In Assam-

డ్రోన్ కెమెరా లతోపాటు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏనుగులను కూడా ఉపయోగించి నిపుణులైన వ్యక్తుల ద్వారా మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు.ఇక ఈ ఏనుగును దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఏనుగు పీడ విరగడవ్వడంతో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

Rogue Bin Laden Elephant Caught In Assam- Telugu Viral News Rogue Bin Laden Elephant Caught In Assam--Rogue Bin Laden Elephant Caught In Assam-