అమెరికా: యువతులు, మహిళలే టార్గెట్ .. కాలిఫోర్నియాను వణికించిన ‘‘డేటింగ్ గేమ్ కిల్లర్’’ మృతి

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో 12 ఏళ్ల బాలిక సహా , మరో నలుగురు మహిళలను దారుణంగా హత్య చేసిన ‘‘డేటింగ్ గేమ్ కిల్లర్ ’’ రోడ్నీ జేమ్స్ అల్కాలా శనివారం కన్నుమూశాడు.అతని వయసు 77 సంవత్సరాలు .

 Rodney Alcala, 'dating Game Killer', Dies In California Hospital, Dating Game Ki-TeluguStop.com

దారుణ హత్యలకు సంబంధించి రోడ్నీకి కోర్టు మరణశిక్ష విధించింది.ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్న ఆయన శనివారం శాన్ జోక్విన్ వ్యాలీ ఆసుపత్రిలో సహజ కారణాలతో మరణించారని జైలు అధికారులు తెలిపారు.

‘‘ ది డేటింగ్ గేమ్ కిల్లర్’’గా పేరు తెచ్చుకున్న అల్కాలా 1977 నుంచి 1979 మధ్యకాలంలో కాలిఫోర్నియాలో ఐదు హత్యలు చేశాడు.వీరిలో 12 ఏళ్ల బాలిక కూడా వుంది.

ఈ నేరాలకు గాను 2010లో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది.అయితే అల్కల దేశవ్యాప్తంగా సుమారు 130 మంది పిల్లలను హత్య చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Telugu Game Killer, Natural, Calinia, Rodney Alcala, Rodneyjames, Serialkiller-T

రోడ్నీస్ ఫోటోలు తీస్తానని మహిళలను పిలిపించి.ఆపై లైంగికంగా అనుభవించేవాడు.కామవాంఛ తీర్చుకున్న తర్వాత బాధితులను గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేవాడు.హత్య, అత్యాచారం, చిత్రహింసలకు గురిచేయడం రోడ్నీ స్టైల్.అయితే గడిచిన 44 ఏళ్ల కాలంలో అతని బారినపడిన బాధితుల సంఖ్య ఎప్పటికీ తెలియకపోవచ్చునని పరిశోధకులు అంటున్నారు.

న్యూయార్క్‌లో జరిగిన రెండు నరహత్యలను తానే చేశానని అంగీకరించిన తర్వాత 2013లో ఆల్కాలాకు 25 ఏళ్ల అదనపు శిక్ష విధించారు.1977లో 28 ఏళ్ల మహిళ మరణానికి సంబంధించి డీఎన్ఏ ఆధారాలు సరిపోవడంతో 2016లో రోడ్నీపై మళ్లీ అభియోగాలు మోపారు.

Telugu Game Killer, Natural, Calinia, Rodney Alcala, Rodneyjames, Serialkiller-T

అమెరికన్ టెలివిజన్ షో ‘‘ ది డేటింగ్ గేమ్’’ ఎపిసోడ్‌లో 1978లో బ్యాచిలర్ నెం 1గా కనిపించిన రోడ్నీ ఆల్కాల ‘‘ ది డేటింగ్ గేమ్ కిల్లర్’’గా మారాడు.అల్కాలా ఈ పోటీలో గెలిచినప్పటికీ, బ్యాచిలొరెట్ ఆడుతున్న మహిళ తర్వాత అతనితో డేట్ చేయకూడదని నిర్ణయించుకుందట.టెలివిజన్ షోలో కనిపించిన తర్వాత కూడా రోడ్నీ హత్యలను కొనసాగించాడని అధికారులు చెబుతున్నారు.హత్యల అనంతరం వారి చెవి పోగులను రోడ్నీ సేకరించేవాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.

1980లో ఆరెంజ్ కౌంటీలో రాబిన్ సామ్సో అనే 12 ఏళ్ల బాలికను హత్య చేసినందుకు తొలిసారిగా రోడ్నీకి మరణశిక్ష విధించారు.అయితే అతని శిక్షను కాలిఫోర్నియా సుప్రీంకోర్టు రద్దు చేసి, కొత్త విచారణకు ఆదేశించింది.తర్వాత రెండో విచారణలో రోడ్నీ జరిమానాను ఎదుర్కోగా, 2003లో దీనిని మళ్లీ రద్దు చేశారు.

తర్వాతి సంవత్సరాల్లో పరిశోధకులు.అల్కాలా హత్యలకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలను కనుగొన్నారు.2010లో జరిగిన విచారణలో 1977 నుంచి 1979 మధ్య కాలంలో సామ్సోతో పాటు 18 నుంచి 32 ఏళ్ల వయసున్న మరో నలుగురు మహిళలను చంపినట్లు రోడ్నీ దోషిగా తేలాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube