ఏంది నిజమా : అప్పట్లో రాడ్ గోపాల్ వర్మ అలాంటి సినిమాల క్యాసెట్లను అమ్మాడా…  

Rod Gopal Varma Movie Poster Talk, Rod gopal varma, Tollywood new movie news, poster talk, Ram Gopal varma, tollywood - Telugu Poster Talk, Ram Gopal Varma, Rod Gopal Varma, Tollywood, Tollywood New Movie News

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వాస్తవిక సంఘటనలు మరియు సినీ ప్రముఖులు రాజకీయ నేతలు జీవిత గాథ ఆధారంగా సినిమాలు తీస్తూ ఆన్ లైన్ ద్వారా విడుదల చేస్తూ సొమ్ము చేసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ మధ్య టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ హీరో జీవిత గాధను తెరకెక్కించి ఆయన అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.

 Rod Gopal Varma Movie Poster Talk

దీంతో ఏకంగా వారు “పరాన్నజీవి” అనే చిత్రాన్ని తెరకెక్కించి రామ్ గోపాల్ వర్మ కి  రీ కౌంటర్ ఇచ్చారు.

అయితే రామ్ గోపాల్ వర్మ గురించి మరో చిత్రం రాబోతోంది.

ఏంది నిజమా : అప్పట్లో రాడ్ గోపాల్ వర్మ అలాంటి సినిమాల క్యాసెట్లను అమ్మాడా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.ఈ పోస్టర్ ని ఒకసారి పరిశీలించినట్లయితే అప్పట్లో రామ్ గోపాల్ వర్మ శృంగార భరిత తరహా చిత్రాల క్యాసెట్లు అమ్ముతూ పోలీసులకు పట్టుబడినట్లు పోస్టర్లో స్పష్టంగా తెలిపారు.

అలాగే ఈ చిత్రానికి రాడ్ గోపాల్ వర్మ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు.

దీంతో ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అంతేగాక కొంత మంది ఆర్జీవీ అభిమానులు ఈ పోస్టర్ పై స్పందిస్తూ ఒక వ్యక్తి పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ సినిమాలు తీయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ చిత్ర పోస్టర్ పై స్పందించ లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ “మర్డర్” అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్ర విడుదలను కూడా నిలిపివేయాలంటూ అమృత ప్రణయ్ కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అలాగే ప్రస్తుతం “థ్రిల్లర్” అనే చిత్రానికి కూడా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసి మంచి స్పందన లభించింది.

#Ram Gopal Varma #Rod Gopal Varma #Poster Talk #TollywoodNew

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rod Gopal Varma Movie Poster Talk Related Telugu News,Photos/Pics,Images..