యువ దర్శకుడుతో రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఆల్ ఓవర్ ఇండియాలో అందరి దృష్టిని ఆకర్షించిన హీరో రాకింగ్ స్టార్ యష్.కేజీఎఫ్ కి ముందు కన్నడ ఇండస్ట్రీకి పరిమితం అయిన రాకింగ్ స్టార్ అక్కడ స్టార్ హీరోగా ఉన్న కూడా భారీ బడ్జెట్ సినిమాలు చేసింది అయితే లేదు.

 Rocking Star Yash Next Movie With Narthan, Kgf Chapter 2, Tollywood, Sandalwood,-TeluguStop.com

అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా రాకింగ్ స్టార్ యష్ పేరు మారుమోగిపోయింది.ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ టేకింగ్ ఒక ఎత్తయితే దానికి యష్ మాసివ్ పెర్ఫార్మెన్స్ మరో ఎత్తు అని చెప్పాలి.

వీరిద్దరు కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో ఎవరు సృష్టించని అరుదైన రికార్డుని సృష్టించారు.ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో కేజీఎఫ్ కి సీక్వెల్ గా వస్తున్న చాప్టర్ 2 మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో సుమారు 250 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యష్ తో సినిమాలు చేయడానికి ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ దర్శకుల వరకు చాలా మంది ఎదురుచూస్తున్నారు.

వీరిలో తన నెక్స్ట్ సినిమాని ఎవరితో చేస్తారనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది.అయితే యష్ మాత్రం పరభాష దర్శకులకి కాకుండా తమ మాతృభాషలోని టాలెంటెడ్ దర్శకుడికి అవకాశం ఇచ్చాడని తెలుస్తుంది.

అది కూడా ఒకే ఒక్క సినిమా చేసిన యంగ్ దర్శకుడు నార్తన్ తో యష్ నెక్స్ట్ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడని శాండల్ వుడ్ లో వినిపిస్తుంది.ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే యాక్షన్ కథాంశంతోనే తెరకెక్కుతుందని తెలుస్తుంది.

త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని బోగట్టా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube